అశేష మెగాభిమానులు అందరికీ మెగాస్టార్ చిరంజీవిని మరోసారి స్ర్కీన్ మీద చూడాలని ఎంతో ఆకాంక్ష ఉండేది. అందుకే అన్నేసి సంవత్సరాలు సినిమాలను వదిలేసి రాజకీయాలకు వెళిపోయిన మెగాస్టార్.. తిరిగి 'ఖైదీ నెం 150' సినిమాతో దూసుకొచ్చాడు. వెండితెరపై తానో మహారాజునని తన రీఎంట్రీ సినిమాతో నిరూపించాడు. కలక్షన్లు హోరెత్తిస్తూ బాక్సాఫీస్ ను పరిగెత్తిస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఫ్యాన్స్ సరే.. ఇదంతా దగ్గరినుండి చూసిన మెగా ఫ్యామిలీ పరిస్థితి అప్పుడు ఎలా ఉంది? ఆయన రీఎంట్రీ సినిమా చూసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఇదే విషయంపై మెగా కోడలు ఉపాసన తనదైన స్టయిల్లో స్పందించింది.
అలా మెగాస్టార్ ను చాలాకాలం తరువాత తెరపై చూడగానే మొత్తం ఫ్యామిలీ అంతా ఎమోషన్ అయ్యారట. ''ఆ క్షణాలు మర్చిపోలేను. మేమందరం సినిమా చూసినప్పుడు.. ఫ్యామిలీ మెంబర్స్ ఆనందం - ఉద్వేగం చూసి.. చివరకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి'' అని చెప్పింది ఉపాసన. అయితే చిరంజీవి రీఎంట్రీ అంటే.. ఉపాసన మాత్రం చిరు గురించి వర్రీ అవ్వలేదట.. చరణ్ గురించి ఫీలైందట. ''మామయ్య గురించి అస్సలు వర్రీ కాలేదు. ఆయనో మాస్టర్. ఆయనకు ఏం చేయాలి ఎలా చేయాలి తెలుసు. కానీ.. నా భర్త చరణ్ మాత్రం చిన్న వయసులో అంత పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడం చాలా రిస్క్ అండ్ టఫ్ అనిపించింది. ఒక ప్రక్కన తను హీరోగా ఒక సినిమా చేస్తూ మరోవైపు తండ్రి 150వ సినిమాను నిర్మించడం అనేది చాలా ప్రెజర్. అందుకు ఔట్ పుట్ చూశాక.. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ చరణ్'' అంటూ చెప్పింది.