గత ఏడాది ఆరంభంలో కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ అయ్యాయి.. షూటింగ్ లు చాలా వరకు నిలిచి పోయాయి. ఏడాది చివర్లో మెల్లగా షూటింగ్ లు ప్రారంభం అవుతున్నాయనుకున్న సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండగా సెకండ్ వేవ్ మళ్లీ సినిమా ఇండస్ట్రీ స్థంభించేలా చేసింది. సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోయాయి.. విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు థియేటర్ల పై ఆంక్షల కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలకు ముంగిట నిలిచి పోగా వందల సంఖ్యలో సినిమాలు మద్యలో ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుండి గత ఏడాది ఎన్నో సినిమాలు రావాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల రాలేదు. కనీసం ఈ ఏడాది అయినా కనీసం డజను మెగా మూవీస్ వస్తాయనుకుంటే సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ నిలిచి పోయాయి.
సెకండ్ వేవ్ కారణంగా మెగా హీరోల సినిమాల విడుదల తేదీలు గందరగోళంగా మారాయి. మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఈనెల విడుదల అవ్వాల్సి ఉండగా వాయిదా పడింది. ఇదే ఏడాది చిరంజీవి ఆచార్య కాకుండా మరో సినిమా తో కూడా రావాలనుకున్నాడు. కాని అది ఇప్పుడు దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంది. ఇక పవన్ ఏదోలా వకీల్ సాబ్ తో వచ్చాడు. కాని ఈ ఏడాదిలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ తో కూడా రావాల్సి ఉంది. కాని ఆ సినిమా షూటింగ్ నిలిచి పోవడమతో వచ్చేది అనుమానమే అన్నట్లుగా ఉంది. చిరంజీవి నుండి మొదలుకుని కళ్యాణ్ దేవ్ వరకు మెగా ఫ్యామిలీ హీరోలకు చెందిన అందరి సినిమాలపై సెకండ్ వేవ్ ప్రభావం కనిపిస్తుంది.
అల్లు అర్జున్ పుష్ప సినిమా ఆగస్టులో విడుదల అవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ సినిమా వాయిదా విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. కాని షూటింగ్ అనుకున్నట్లుగా జరగడం లేదు. దాంతో సినిమా వాయిదా వేయక తప్పదేమో అంటున్నారు. పుష్ప సినిమా విడుదల వాయిదా పడ్డ ఈ ఏడాది చివరి వరకు అయినా విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. విడుదలకు ఇంకాస్త సమయం ఉన్నా కూడా షూటింగ్ జరగని కారణంగా మళ్లీ ఆ సినిమాను వాయిదా వేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్.. వరుణ్ తేజ్ గని మరియు ఎఫ్ 3 సినిమాల విడుదల తేదీలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇక వైష్ణవ్ తేజ్ కొండపొలం విషయంలో కూడా ఊగిసలాట కనిపిస్తోంది. ఇలా మొత్తంగా అందరు మెగా హీరోల సినిమాలకు సెకండ్ వేవ్ పెద్ద తల భారంగా నిలిచింది.