మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ `వాల్తేరు వీరయ్య` తెరకెక్కుతోన్న సంగతి తె లిసిందే. `గాడ్ ఫాదర్` షూటింగ్ పూర్తికాగానే వీరయ్యని చిరు పట్టాలెక్కించారు. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. వైజాగ్ బ్యా క్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో మెగాస్టార్ వీరయ్య అనే మాస్ పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ పై ఎంతో అభిమానంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తన అభిమానమంతా సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుందని ఇప్పటికే రివీల్ చేసాడు. దానికి తగ్గట్టే చిత్రాన్ని సెట్స్ లో చెక్కుతున్నారు. ఇక ఈ సినిమా విషయంలో చిరంజీవి స్ర్కిప్ట్ దశ నుంచే ఎంతో జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. స్ర్కిప్ట్ ని ఎలా సానబెట్టారు? అన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. `ఎంత తొమితే అంత షైన్ అవుతారు ఎవరైనా? కథ బాగుంది..అని నాలుగు సీన్లు వేసుకుని షూటింగ్ కి వెళ్లిపోవచ్చని చాలా మంది తొందరపడుతున్నారు. కానీ నిశితంగా..భూతద్దంలో పెట్టి చూస్తే చాలా లాజిక్ లకు సమాధానం చెప్పాలి. ప్రతీ కథకి ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉంటుంది. ఎంత చేస్తే అంత బాగా ఉక్కులా కథ తయారవుతుంది. ఇటీవలే `వాల్తేరు వీరయ్య` టైలిల్ బయటకు రాగానే మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నయ్య అని బాబి నాదగ్గరకు వచ్చి చెప్పాడు. అప్పుడే బాబి కి చెప్పాను . `ఇక నీకు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయని`.. వాళ్లు అలా అంటున్నారంటే దాని లో కో ర్ బాగుందని అర్ధం . కథలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. లోతుగా వెళ్లే కొద్ది ఎన్నో సందేహాలు మొదలవుతాయి. లాజిక్ లు అడ్డొస్తాయి. ఇవన్నీ సెట్ చేసుకుంటూ వెళ్లాలంటే మరో రెండు నెలలు సమయం పడు తుందని`` కథని సానబెట్టిన విషయాన్ని రివీల్ చేసారు. కథ విషయంలో చిరు ఇంత కఠినంగా ఉన్నారంటే? సెట్ లో యవ్వారం వీరయ్యతో ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సి పనిలేదు. పర్పెక్షన్ కోసం టేక్ లు మీద టేట్ లు తప్పనిసరి. వన్ మోర్ అంటూ మహేష్ తరహాలో మెగాస్టార్ డైరెక్టర్లని రఫ్పాడించేస్తారు. ఇలాంటి నవతరం మేకర్లు దొరికితే నటుడిగా తన అనుభవం మొత్తం రంగరించడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి.