సంచలనాల రాంగోల్ వర్మ మనసు పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన్ని సక్సెస్ వెతుక్కుంటూ..పరుగులు పెట్టుకుంటూ మరీ వస్తుంది. `శివ`..`రంగీలా`..`సత్య`..`కంపెనీ`..`సర్కార్`..`26/11` లాంటి సినిమాలే వర్మ ప్రితిభకి తార్కాణం. కానీ ఆయన ప్రతీసారి అంత రీస్క్ తీసుకోరు. అప్పుడప్పుడు `ఐస్ క్రీమ్` లాంటి టైంపాస్ మూవీలు కూడా చేస్తుంటారు.
`వంగవీటి`..`లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రాల తర్వాత వర్మ కంపెనీ నుంచి సరైన సినిమా రాలేదు. ఆ తర్వాత చేసిన కొన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఫలితంగా వర్మ డిమాండ్ మార్కెట్ లో బాగా తగ్గింది. అంతకు ముందు కొన్ని ప్రాజెక్ట్ లు కేవలం ప్రకటనతోనే సరిపెట్టాల్సి వచ్చింది. దీంతో వర్మపై క్లారిటీ లోపించింది. ఎప్పుడు ఏ ప్రకటన చేస్తున్నారో? ఏ సినిమా తీస్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి కన్ ప్యూజన్ నడుమ వర్మ చెక్ బౌన్స్ కేసుల ఆరోపణలు కూడా ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. నిర్మాత నట్టి కుమార్ కోట్ల రూపాయలు అప్పులు చేసి మోసగించాడని తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రస్తుతం ఈ వివాదం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంగానూ వర్మ పై భారీగా నెగివిటీ స్ర్పెడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వర్మతో కన్నడ స్టార్ ఉపేంద్ర సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప్పి సినిమా చేయడం అన్నది రిస్క్ అవుతుందని వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉపేంద్ర కన్నడలో పెద్ద స్టార్. ఆయనకి దర్శకులే దొరకలేదా? లేక వర్మతో సినిమా చేయాలని పట్టుబట్టి చేస్తున్నారా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నాయి.
మరోవైపు వర్మలో పాజిటివ్ యాంగిల్ పై కామెంట్లు అంతే వేగంగా వైరల్ అవుతున్నాయి. వర్మ తో సినిమా తీసి హిట్ కొడితే అది సంచలనం అవుతుంది. లేకపోతే సైలెంట్ గా వచ్చి పోతుంది. అంతకు మించి హీరోకి పెద్దగా నష్టం వచ్చేది? ఏముంటుంది? అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఉపేంద్ర కి వర్మకి బాగా సింక్ అవుతుందని అంటున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో ఇద్దరు బాగా సింగ్ అవుతారని..ఆ కారణంగా సినిమా హిట్ కే ఎక్కువ స్కోప్ భావిస్తున్నారు. మరి అలాంటి వాళ్ల నమ్మకాన్ని ఈ కాంబో ఎంత వరకూ నిలబెడుతుందో.