ఉపేంద్ర.. నేను లేని ఈ ఆంధ్రనాడు

Update: 2015-08-15 16:11 GMT
హీరో ఉపేంద్ర వెరీ స్పెషల్‌ ప్యాకేజీ. అతడు ఎవరికీ అర్థం కాడు. ప్రతి దాంట్లో అతి చేస్తున్నాడా? అనిపిస్తుంది. సేమ్‌ టైమ్‌ అందరినీ ఆలోచింపజేయడానికే ఇలా చేస్తున్నాడనిపిస్తుంది. ప్రస్తుతం ఉపేంద్ర 2 ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ లో మీడియాకి టచ్‌ లో ఉన్నారాయన. అసలు అతడి మనసులో ఏం ఉంటుందో కూపీ లాగారు సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆర్కే. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే లో ఆయన చేసిన ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉంది. త్వరలో టెలీకాస్ట్‌ కానున్న ఈ ఇంటర్వ్యూ లో మచ్చుకు కొన్ని...

ఆర్కే: మీరు ఒక పెక్యులర్‌ పర్సనాలిటీ. అప్పియరెన్స్‌ కానీ, యాక్షన్‌ కానీ..!
ఉపేంద్ర: ఏమో ఇది బావుంటుందని మొదలెట్టా. ఎక్కువ ఫేస్‌ లు కవర్‌ చేసుకోవడానికి అంతే.

విపరీత ఆలోచనలు అని ఎవరూ అనలేదా?
అన్నారు సర్‌. ఇప్పుడు మీరూ అన్నారు.

హీరో అవ్వాలని మీకు మీరే అనుకున్నారా? ఎవరైనా రెచ్చగొట్టారా?
హీరో అయితే నా మాట వింటారు. మొత్తం మార్చాలి. నాయకుడవ్వాలి. ఇండియాని మార్చాలి. రాజకీయాలు మార్చాలి. అనుకున్నా.

అలాంటి ఆలోచన ఎలా వస్తాయి?
కోరికల నుంచి, భయం నుంచి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇవి రెండూ వదిలేస్తే నేను ఏమైనా చేసుకుంటా.

మిమ్మల్ని మన్మధుడు అంటారు?
రియల్‌ లైఫ్‌ లో ఒకటే. మన్మధుడు లేదు

అవమానాలు ఎదురయ్యాయా?
కళాకారుడికి మొదటి దశ అవమానం, తర్వాత అనుమానం, తర్వాత సన్మానం

ఏ ఫిలాసఫీ నమ్ముతారు?
నేను చేసేది కరెక్టే, మీరు అడిగేది కరెక్టే, జరిగే ప్రతిదీ కరెక్టే అనేది ఫిలాసఫీ.

వరస్ట్‌ క్రిటిసిజమ్‌?
ఎక్సెంట్రిక్‌ గా చేస్తాడు.. కన్ఫ్యూజన్‌ గా ఉంటాయి.

పోస్టర్లు డిఫరెంట్‌ గా చేస్తారుగా?
పోస్టర్స్‌ బర్నింగ్‌ లాగా, షాట్స్‌ బర్నింగ్‌ లా, గెటప్స్‌ అన్నీ బర్నింగ్‌ గా ఉంటాయి.

లైఫ్‌ లో బెస్ట్‌ ఫ్రెండు ఎవరు?
ఇప్పటికి మీరే ఫ్రెండ్‌ ..

పాట పాడండి?
ఉప్పు లేని ఆ పప్పు కూడు ... నేను లేని ఈ ఆంధ్రనాడు... ..
Tags:    

Similar News