పైడిప‌ల్లి క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్న‌మా?

Update: 2019-05-10 09:20 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `మ‌హ‌ర్షి` ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ల‌స్ లు మైన‌స్ ల గురించి క్రిటిక్స్ లో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగింది. సేమ్ టైమ్ ఈ సినిమాకి ప్ర‌శంస‌లు ఎన్ని వ‌చ్చాయో క్రిటిక్స్ నుంచి విమ‌ర్శ‌లు అంతే ఇదిగా పోటెత్తాయి. ఇందులో సాగతీత స‌న్నివేశాలు ఉన్నాయ‌ని.. సీఈవో ట‌ర్న్ డ్ ఫార్మ‌ర్ సీన్స్ లో లెంగ్త్ పెరిగిపోయింద‌ని.. మూడు గంట‌ల నిడివితో అవెంజ‌ర్స్ రేంజును త‌ల‌పించింద‌ని ర‌క‌ర‌కాలుగా ముచ్చ‌టించుకున్నారు. ముఖ్యంగా మ‌హ‌ర్షి సినిమా సుదీర్ఘ నిడివి గురించి క్రిటిక్స్ స‌హా జ‌న‌ర‌ల్ ఆడియన్స్ స‌మీక్ష‌ల్లో ప‌దే ప‌దే ప్ర‌శ్నించ‌డం ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లికి స్ట్రైక్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది.

అందుకే ఆయ‌న నేడు హైద‌రాబాద్ లో జ‌రిగిన స‌క్సెస్ మీట్ లో ప్ర‌త్యేకంగా ఈ పాయింట్ పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌హ‌ర్షి సినిమా మ‌రీ అంత లెంగ్త్ పెర‌గడానికి కార‌ణం రిషీ జ‌ర్నీని ఎలాబ‌రేటెడ్ గా చూపించాల‌న్న ప్ర‌య‌త్న‌మే కార‌ణ‌మ‌ని.. అమెరికాలో కంపెనీ సీఈవో నుంచి రిషీ తిరిగి రైతుగా మార‌డానికి తీసుకునే మ‌లుపు కోసం చాలానే సీన్లు రాయాల్సి వ‌చ్చింద‌ని... రైతు స‌మస్య‌ల‌పై సీన్లు పెంచాల్సొచ్చింద‌ని అందుకే లెంగ్త్ ఎక్కువ‌గా క‌నిపించింద‌ని క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక ప‌తాక‌స‌న్నివేశాలు.. రైతుల‌తో స‌న్నివేశాలు జ‌నాల‌కు బాగా క‌నెక్ట‌య్యాయ‌ని.. మెగాస్టార్ చిరంజీవి త‌న‌కు ఫోన్ చేసి దాదాపు 5 నిమిషాల పాటు ప్ర‌శంస‌లు కురిపించార‌ని పైడిప‌ల్లి కాస్తంత ఎమోష‌న్ గానే తెలిపారు. త‌న హార్ట్ ని రైతు స‌మ‌స్య‌ల‌పైనా.. వ్య‌వ‌సాయంపైనా స‌న్నివేశాలు ట‌చ్ చేశాయ‌ని మెగాస్టార్ కాంప్లిమెంట్ ఇచ్చార‌ని వెల్ల‌డించారు. ఇక‌పోతే ప‌ల్లె ప‌ల్లెనా రైతుల‌కు ఆ సీన్లు ట‌చ్ చేస్తున్నాయ‌ని.. త‌మ సొంత‌ విలేజ్ లోనూ రైతులకు క‌నెక్ట‌య్యాయ‌ని రాక్ స్టార్ దేవీశ్రీ రివీల్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇక తొలిరోజు సాయంత్రం నుంచే థియేట‌ర్ల‌ను పెంచామ‌ని దిల్ రాజు వెల్ల‌డించారు.  


    

Tags:    

Similar News