వెంకటేష్ , నాగ చైతన్య నటించిన 'వెంకీ మామ' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకి కొందరు దర్శకులు హాజరై టీం గురించి సినిమా గురించి చెప్పుకున్నారు. అయితే కొందరు దర్శకులు హీరోలిద్దరినీ మోసేస్తూ తెగ స్పీచ్ లిచ్చారు. అయితే ఈ వేదికపై వంశీ పైడిపల్లి మాత్రం తన బాధను వ్యక్తం చేస్తూ కమర్షియల్ సినిమా గురించి మాట్లాడాడు.
ఈ రోజుల్లో కమర్షియల్ ఎంటర్టైనర్ ని చాలా తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ అన్ని జోనర్లకంటే కమర్షియల్ జోనర్ లో సినిమా చేయడం కష్టం. ఒక కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టడం అంటే ఆశా మాషీ కాదు. మా కర్మ కాలి అన్ని జోనర్స్ ఇందులో మిక్స్ చేయాలి. యాక్షన్ - కామెడీ - రోమాన్స్ ఇలా అన్నీ కమర్షియల్ జోనర్ లో ఉండేలా చూసుకోవాలి. ఇక సినిమాను గెలిపించే వారికంటే ఓడించే వారే ఎక్కువ ఉన్నారు. అంటూ స్పీచ్ ఇచ్చాడు.
అయితే వంశీ పైడిపల్లి మాటల్లో ఏదో పెద్ద అర్థమే ఉందనిపిస్తుంది. కంప్లీట్ గా ఫార్మర్ ఎమోషన్ మీద 'మహర్షి' ని కథ రాసుకొని అందులో అన్నీ చేర్చాల్సి వచ్చిందని ఏమైనా ఫీలయ్యాడో ఏంటో...?