కోలీవుడ్ లో ఎన్నో రియల్ లైఫ్ ప్రేమ కథలు మనం విన్నాం. ఎంతో మంది ప్రేమించుకుని - కొన్నాళ్లకు విడిపోయారు - కొందరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కాని విశాల్ మరియు వరలక్ష్మి మాత్రం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కాని వీరి ప్రేమ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఆమద్య వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు - అదుగో మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు - ఇదుగో మరి కొన్ని రోజుల్లో ఎంగేజ్ మెంట్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాని మా మద్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అంటూ వీరిద్దరు కూడా చెబుతూ వస్తున్నారు.
విశాల్ తాజాగా హీరోగా నటించి - సొంతంగా నిర్మించిన ‘సండైకోళి 2’ చిత్రంలో వరలక్ష్మి విలన్ గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ‘పందెం కోడి 2’ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా వరలక్ష్మి మీడియా తో మాట్లాడుతూ విశాల్ తో తనకున్న అనుబంధంను గురించి చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో విశాల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అంటూ వరలక్ష్మిని ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం తమిళ సినీ మరియు మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఆ ప్రశ్నకు వరలక్ష్మి సమాధానం ఇస్తూ.. నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అంటూ విశాల్ ను చాలా సార్లు ప్రశ్నించాను. కాని ఆయన ఏ సమాధానం చెప్పలేదు. ఇంకొంత కాలం గడిస్తే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా అమ్మాయి దొరకదని - నీకు అమ్మాయిని ఇచ్చేందుకు ఏ ఒక్కరు ముందుకు రారని కూడా చెప్పాను - కాని ఆయన మాత్రం పెళ్లి కి నడిగర్ సంఘం భవనంకు ముడి పెడుతున్నాడు. ఎప్పుడైతే నడిగర్ సంఘం భవనంను పూర్తి చేస్తాడో అప్పుడే పెళ్లి చేసుకోవాలని దృడ నిశ్చయంతో ఉన్నాడంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది.
తమిళ సినీ వర్గాల్లో మరియు మీడియాలో మాత్రం వీరిద్దరు ఎప్పుడో ఒకసారి బాంబు పేళ్చడం ఖాయం అని - తాము ప్రేమించుకుంటున్నాం - పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించడం ఖాయం అంటూ చర్చ జరుగుతుంది. వీరి ప్రేమ ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకైనా బయట పడటం ఖాయమని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.