చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు బాబు ఓడి జగన్ అధికారంలోకి వచ్చినా వర్మ కష్టాలు మాత్రం తీరడం లేదు.
జగన్ గెలవడంతో సమరోత్సాహంతో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ మూవీపై టీడీపీ నుంచి, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏపాల్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. తనను కామెడియన్ గా సినిమాలో చూపించారని కేఏ పాల్ హైకోర్టుకెక్కాడు. దీంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇక సెన్సార్ బోర్డు కూడా కులాల మధ్య చిచ్చుపెట్టేలా.. అవమానించేలా సినిమా ఉందని సర్టిఫికెట్ ఇవ్వలేదు.
దీంతో రాంగోపాల్ వర్మ ఇప్పుడు ‘కమ్మ రాజ్యం’ సినిమా విడుదల కోసం పోరాడుతున్నాడు. ఇప్పటికే దాని పేరును ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ మార్చి దాదాపు అభ్యంతరాలు తెలిపిన 12 సీన్లను కట్ చేశాడు. ఈ మేరకు హైకోర్టులో పిటీషన్ వేశాడు. సినిమాను రేపు విడుదల చేస్తామని.. పర్మిషన్ ఇవ్వాలని కోరాడు.
అయితే హైకోర్టు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కావాలని కోరింది. కానీ సెన్సార్ బోర్డు వర్మ సినిమాకు ఇప్పటికే సర్టిఫికెట్ ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. మరి కట్స్ తర్వాత అయినా సెన్సార్ కరుణిస్తుందా లేదా అన్నది చూడాలి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వర్మ ఫలితాలు కనిపించడం లేదు. మరి ‘కమ్మ రాజ్యంలో’ సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది ఉత్కంఠ నెలకొంది.