వరుణ్ తేజ్ కి 'ఫిదా' అవ్వాల్సిందే

Update: 2016-08-05 04:30 GMT
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం శ్రీనువైట్లతో మిస్టర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పెయిన్ షూటింగ్ ని ఫినిష్ చేసుకుని.. మంగళూర్ షెడ్యూల్ కు వెళ్లనుండగా.. ఇప్పుడు మరో సినిమా మొదలుపెట్టేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ కుర్రాడితో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా ఇప్పటికే ఫైనల్ అయింది. వరుణ్ తేజ్ - హీరోయిన్ సాయిపల్లవిలతో కలిసి.. శేఖర్ కమ్ముల స్టోరీ సిట్టింగ్స్ చేస్తున్న ఫోటోలు ఆన్ లైన్ లో దర్శనమిచ్చేశాయి.

వరుణ్ తేజ్ హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్ గా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి 'ఫిదా' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని చెప్పిన యూనిట్.. మూవీ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈరోజు (ఆగస్ట్ 5న) అధికారికంగా అనౌన్స్ మెంట్ తో పాటు.. పూజా కార్యక్రమాలు..  ముహూర్తం షాట్ చిత్రీకరణ కూడా చేయనున్నారు. షూటింగ్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్న శేఖర్ కమ్ముల.. వెంటనే ప్రారంభించేయనున్నాడు కూడా.

నిజామాబాద్  జిల్లా బాన్సువాడలో ఆగస్ట్ 5నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న చిత్రం కావడంతో.. ఫిదా పై అంచనాలు బాగానే ఏర్పడే ఛాన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్ ఇప్పటికే వరుణ్ తేజ్ కి ఫిదా అయిపోయారు కాబట్టి...  మరి వరుణ్ తేజ్- సాయి పల్లవిలలో ఎవరు ఎవరికి ఫిదా అయిపోతారో?
Tags:    

Similar News