ఈ ఏడాది తొలిప్రేమతో సూపర్ సక్సెస్ ను అంతరిక్షంతో మంచి ప్రశంసలను దక్కించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అదే జోరును కొనసాగించబోతున్నాడు. జనవరిలో ప్రారంభమయ్యే కొత్త సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ కు వెళ్ళిపోతున్నాడు. దీనికి సంబంధించిన కసరత్తులు కూడా మొదలుపెట్టాడు. అంతరిక్షంలో కాస్త బొద్దుగా కనిపించిన వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించాలంటే ఫిజిక్ చాలా ముఖ్యం కాబట్టి తక్కువ టైం ఉన్నప్పటికి కఠినమైన కసరత్తులతో వర్క్ అవుట్ చేస్తున్నట్టు సమాచారం. దీని తాలుకు పిక్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.
కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్న ఈ మూవీని అల్లు అర్జున్ అన్నయ్య వెంకటేష్ అలియాస్ బాబీ నిర్మించబోతున్నాడు.నిర్మాతగా ఆయన ఫస్ట్ కార్డు మూవీ ఇదే. సో రామ్ చరణ్ గతంలో ధృవ కోసం ఏదైతే సిక్స్ ప్యాక్ చేసి వావ్ అనిపించుకున్నాడో అదే తరహాలో తమ్ముడు వరుణ్ తేజ్ కూడా జిమ్ బాట పట్టాడు. బాక్సింగ్ నేపధ్యంలో అనే చిన్న లీక్ తప్ప సినిమాకు సంబంధించి ఇంకే వివరాలు లీక్ కాలేదు. వచ్చే నెల మొదలుపెడతారా లేక ఇంకాస్త టైం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
కిరణ్ కొర్రపాటి గతంలో వరుణ్ మిస్టర్-తొలిప్రేమ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు. అప్పటి నుంచే ఇంతనికి వరుణ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. కథ బాగా నచ్చడంతో వరుణ్ ఆఫర్ ఇచ్చేసాడు. డెబ్యు డైరెక్టర్ గా తొలిప్రేమతో వెంకీ అట్లూరి ఎలాగైతే సక్సెస్ అందుకున్నాడో కిరణ్ కొర్రపాటి కూడా అదే తరహాలో హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్