చిరంజీవికి అతి పెద్ద ఫ్యాన్ నేనే

Update: 2015-09-17 17:04 GMT
ఆక్టోబర్ 2న రిలీజ్ కానున్న కంచె ఆడియో వేడుక అంగరంగవైభవంగా జరిగింది. రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరై.. ఈ వేడుకకు మరింత వన్నె తెచ్చాడు. ఇలాంటి కథ చాలా అరుదుగా దొరుకుతుందని, ఇంత మంచి స్టోరీతో మూవీ చేసినందుకు హ్యాపీగా ఉందన్నాడు దర్శకుడు క్రిష్.

ఈ మూవీ తీసిన కాన్సెప్ట్ తో దక్షిణాది లో ఏ సినిమా రాలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో 25 లక్షల మంది దక్షిణాది వారు పోరాడినా.. ఈ పాయింట్ పై ఎవరూ సినిమా తీయలేదన్నాడు క్రిష్. అయితే విభిన్నంగా ఉండేందుకు తాను ఈ కాన్సెప్ట్ ఎంచుకోలేదని.. మరుగున పడ్డ కొన్నిలను బయటకు చెప్పడమే తన ఉద్దేశ్యంగా తెలిపాడు. తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ బ్రూస్ లీ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు దర్శకుడు. ఈ మూవీని పుడమికి అంకితం ఇస్తున్నానంటూ.. క్రిష్ చెప్పిన వీడ్కోలు అందరినీ కదిలించింది.

చిరంజీవికి అది పెద్ద ఫ్యాన్ తానే అన్నాడు హీరో వరుణ్ తేజ్. మంచి సినిమా చేస్తున్నానని.. మీ పరువు నిలబెతానని... చిరుకు చెప్పాడట. ఫంక్షన్ కి వచ్చినందుకు అన్న రామ్ చరణ్ కి, ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు క్రిష్ కి థ్యాంక్స్ చెప్పాడు వరుణ్. సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలాసార్లు స్టన్ అయ్యాడట. ఇలాంటి ఐడియాలు డైరెక్టర్ కి ఎలా వస్తాయో అనిపించేదని అన్నాడు. అంతేకాదు బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సినిమా చూపించి ఎలా ఉందో అడుగుతానంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. రిలీజ్ అయ్యాక మెగా అభిమానులు అందరూ గర్వపడేలా ఉంటుందని చెప్పాడు వరుణ్ తేజ్.
Tags:    

Similar News