వ‌రుణ్ మ‌రో మెగా ప్ర‌యోగం

Update: 2018-12-20 08:39 GMT
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ హీరో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు అన‌గానే మ‌రో మూడు నాలుగు సినిమాలు క్యూలో ఉంటున్నాయి. ముగ్గురు న‌లుగురు ద‌ర్శ‌కులు క‌థ‌లు వినిపించి త‌న కోసం వెయిటింగ్‌లోనూ ఉంటున్నారు. ఆ కోవ‌లోనే గీతా ఆర్ట్స్‌ - 14 రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ - కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ వంటి సంస్థ‌లు వ‌రుణ్ క్యూలో ఉన్నాయి. వీళ్లంద‌రూ వ‌రుణ్ కోసం ప్ర‌స్తుతం క‌థ‌ల్ని వండే ప‌నిలో ఉన్నారు.
అలాగే స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ సైతం ఇప్ప‌టికే వ‌రుణ్ కోసం ఓ క‌థను త‌యారు చేస్తున్నాడు. స్క్రిప్టు పూర్తి స్థాయిలో రూపొందించాల్సి ఉందిట‌.

ఈ సంగ‌తిని వ‌రుణ్ స్వ‌యంగా చెప్పాడు. హ‌రీష్ ఇంకా సీరియ‌స్ గా వ‌ర్క్ చేస్తున్నాడు. చెప్పిన పాయింట్ మాత్రం న‌చ్చింది.. అని చెప్పాడు. అలాగే అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఫేం సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నా. ఇది కొంచె బిగ్ స్కేల్ సినిమా. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ చిత్రం. త‌ను రూపొందిస్తున్న స్క్రిప్టులో ఓ పాయింట్ ద‌గ్గ‌ర తెగ‌లేదు. దానిపై ఇంకా వ‌ర్క్ జ‌రుగుతోంది.. అని చెప్పాడు.

వీట‌న్నిటినీ మించి బాంబ్ లాంటి వేరొక అప్ డేట్ చెప్పాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ కోసం గీతా ఆర్ట్స్ లో భారీ చిత్రానికి స‌న్నాహాలు సాగుతున్నాయి. వ‌రుణ్ కెరీర్ బెస్ట్ గా ఉండే మ‌రో ప్ర‌యోగాత్మ‌క  చిత్ర‌మిది. టాలీవుడ్ లో నెవ్వ‌ర్ బిఫోర్ అన్న చందంగా ఈ సినిమా ఉంటుంద‌ట‌. అయితే అస‌లు ఆ క‌థ ఏంటి? అని వ‌రుణ్ నే అడిగేస్తే.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ని చెప్పాడు. ఈ చిత్రంతో కిర‌ణ్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. ప్ర‌స్తుతం స్క్రిప్టును పూర్తి స్థాయిలో రూపొందిస్తున్నార‌ని చెప్పాడు. అస‌లు వ‌రుణ్ తేజ్ లైన‌ప్ చూస్తుంటే మామూలుగా లేదు. ఒక ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా, ఒక ప్ర‌యోగాత్మ‌క సినిమా అంటూ ఏ ఇత‌ర హీరోతో పోల్చినా డిఫ‌రెంటుగానే వెళుతున్నాడు. కొత్త త‌ర‌హా క‌థ‌ల్లో న‌టించాల‌ని .. కొత్త కుర్రాళ్ల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే సినిమాలు చేస్తున్నాన‌ని ఎలాంటి భేష‌జం లేకుండా చెప్పాడు. అంత‌రిక్షం లాంటి ప్ర‌యోగంపై కొంచెం టెన్ష‌న్ గా ఉన్నా.. ప్ర‌తి నిమిషం ప్రేక్ష‌కుల్ని యంగేజ్ చేసేలా సంక‌ల్ప్ తీశాడ‌ని అన్నారు. అలాగే అంత‌రిక్షం లాంటి ప్ర‌యోగం త‌ర్వాత ఎఫ్-2 రిలీజ‌వుతుంది. అటుపై క్రీడా నేప‌థ్యంలో ఇదివ‌ర‌కూ లేని కొత్త క‌థ‌తో వ‌స్తున్నాడు. వ‌రుణ్ స్ట్రాట‌జీనే వేరు అంటూ మీడియాలోనూ బోలెడం చ‌ర్చ సాగుతోంది.
   

Tags:    

Similar News