వెంకీకే చిరాకు తెప్పించిన నటుడు

Update: 2019-05-12 04:40 GMT
ఎఫ్2 ఇండస్ట్రీ సక్సెస్ తో తన ట్రాక్ రికార్డు ని మళ్ళి సక్సెస్ వైపు మళ్లించిన వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా తనవి తప్ప మిగిలిన సినిమాలకు డబ్బింగ్ ఇచ్చే అలవాటు లేని విక్టరీ హీరో మొదటిసారి హాలీవుడ్ మూవీ అల్లాదీన్ కోసం గాత్రం అరువు ఇచ్చాడు. జీనీ పాత్ర పోషించిన విల్ స్మిత్ ను మనం వెంకీ వాయిస్ లో వినొచ్చు.

ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్  ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. విల్ స్మిత్ నటన మాడ్యులేషన్ చాలా టిపికల్ ఉంటుందని అంత గొప్ప పెర్ఫార్మన్స్ కు డబ్బింగ్ చెప్పడం సులభం కాదని చెప్పాడు. ఓ దశలో ఇరిటేషన్ వచ్చి డబ్బింగ్ స్టూడియో నుంచి బయటకు వెళ్ళిపోయాడట

తర్వాత అలోచించి దాన్నొక ఛాలెంజ్ గా తీసుకుని పూర్తి చేశానని చెప్పాడు. వరుణ్ తేజ్ కూడా అల్లాదీన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడాన్ని ఎగ్జైటింగ్ గా ఫీలయ్యానని సెలవిచ్చాడు. మొత్తానికి ఈ ఇద్దరు సంక్రాంతి తొడలుళ్లు మరోసారి హాలీవుడ్ మూవీ తో అల్లరి చేయబోతున్నారు. మే 24న విడుదల కానున్న అల్లాదీన్ గై రిచీ దర్శకత్వంలో రూపొందింది. గతంలో ఈ సిరీస్ లో తెలుగులో కూడా సినిమాలు వచ్చాయి. అయితే అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో త్రిడి ఫార్మాట్ లో రూపొందిన మూవీ కాబట్టి అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి
Tags:    

Similar News