`మిస్టర్ మజ్ను` ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. తాను ఏ పని చేసినా సంపూర్ణంగా చేస్తానని - ప్రస్తుతం ప్రమోషన్స్ లో మాత్రమే బిజీగా ఉన్నానని తెలిపాడు. నేడు హైదరాబాద్ లో జరిగిన ఇంటర్వ్యూలో వెంకీకి ఓ ప్రశ్న సూటిగా తాకింది. ముందు హీరో అయ్యారు. తర్వాత రచయిత.. ఇప్పుడేమో దర్శకుడు అంటున్నాడు. అసలు ఏమవుతాడో అని ఎన్టీఆర్ అన్నారు కదా? మరి ఆ మాటతో మీకు ఏమనిపించింది? అని ప్రశ్నిస్తే...
`తొలి ప్రేమ`తో వీడు సెటిలవుతాడని తారక్ అనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని - అది తాను ఊహించనిది అని వెంకీ అట్లూరి అన్నారు. తొలి ప్రేమ హిట్టయినా తన నుంచి ఒక్క ప్రశంస కూడా రాలేదు. కానీ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పారు తారక్. అందుకే ఆయన గ్రేట్ అని వెంకీ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
మరి ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అని ప్రశ్నిస్తే .. అది ఊహకే అందరినిది అని ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు వెంకీ. తారక్ తో తప్పకుండా సినిమా చేయాలని నాకూ ఉంది. అయితే అంత పెద్ద స్ట్రేచర్ ఉన్న నటుడితో సినిమా అంటే అన్నీ ఎలిమెంట్స్ పక్కాగా కుదరాలి కదా? మంచి కథ కుదరాలి. ఇంకాస్త అనుభవం రావాలి. అన్నీ అమరితే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను... అని వెంకీ అన్నారు.
రైటర్ కం డైరెక్టర్ గా మీకు ఎవరు స్ఫూర్తి? అని ప్రశ్నిస్తే.. త్రివిక్రమ్ అంటే చాలా ఇష్టం. అతడే నా స్ఫూర్తి. అలాగే మణిరత్నం ఇన్ స్పిరేషన్. మణి సర్ సినిమాలు భారీగా ఉండవు. సింపుల్ గా ఉంటాయి. అలాగే త్రివిక్రమ్ రైటర్ గా రైటింగ్ ను సింప్లిఫై చేసేశారు. ఆయన స్ఫూర్తితోనే సినిమాలకు రైటింగ్ చేశాను.. అని తెలిపారు.