షాకింగ్ విషాదం.. సీనియర్ నటి కవిత కుమారుడు మృతి

Update: 2021-06-17 03:57 GMT
సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలుగు.. తమిళ.. కన్నడ.. మలయాళం సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసిన ఆమె.. గతంలో టీడీపీ నేతగా వ్యవహరించారు. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో పోరాడి ఓడారు.

కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న సంజయ్ కు కరోనా సోకటం.. దీంతో చికిత్స కోసం అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. ఎంత ప్రయత్నించినప్పటికి అతను కోలుకోలేదు. చివరకు కరోనాతో పోరాడి ఓడిపోయారు. తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఆమె భర్త  సైతం కరోనాతో పోరాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఓవైపు చెట్టంత కొడుకును కోల్పోయిన ఆమె.. భర్త సైతం ఆసుపత్రిలో ఉండటంపై పలువురు సానుభూతి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కవిత కుమారుడు సంజయ్ మరణించిన మూడు రోజులు అవుతుందని.. అయితే ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కవిత కుమారుడు కొవిడ్ తో మరణించటం.. ఆ విషయాన్ని పెద్దగా షేర్ చేసుకోలేదంటున్నారు. దీనికి తోడు.. కుటుంబ పెద్ద కూడా ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స చేయించుకుంటున్న నేపథ్యంలో.. ఈ విషాద ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. కవితకు ఎదురైన పుత్రశోకానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Tags:    

Similar News