వీడియో : క్యూట్‌ సితూ పాప పెన్నీ మేకింగ్‌

Update: 2022-03-28 11:36 GMT
సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌ గా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా నుండి ఇటీవలే పెన్నీ సాంగ్ వచ్చిన విషయం తెల్సిందే. పెన్సీ లిరికల్‌ వీడియో లో సితార ను థమన్‌ తీసుకు వచ్చాడు. నాన్న సినిమా కోసం సితార పెన్నీ సాంగ్ కోసం రావడంతో ప్రస్తుతం ఆ పాట సూపర్ డూపర్ అంటూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

సితార అప్పియరెన్స్ తో లిరికల్‌ వీడియో స్థాయి అమాంతం పెరిగింది. సినిమాలో సితార ఉండక పోయినా ఇలా పాటలో అయినా ఉండటం బాగుంది అంటూ మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సితారకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్ మరియు వీడియోలు షేర్‌ అయ్యాయి. పెన్నీ క్యూట్ వీడియో అంటూ చాలా మంది సితార వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఇప్పుడు పెన్నీ సాంగ్‌ కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేయడం జరిగింది. సితార షూటింగ్ లో ఏమాత్రం ఇబ్బంది పడకుండా చాలా కూల్ గా ఒక ప్రొఫెషనల్‌ నటిగా డాన్సర్ గా చేసిందని మేకింగ్‌ వీడియోను చూస్తుంటే అనిపిస్తుంది. మహేష్ బాబు భార్య నమ్రత ఈ పాట మేకింగ్‌ ను స్వయంగా దగ్గర ఉండి పర్య వేక్షించిందని.. సితార యొక్క కెమెరా అప్పియరెన్స్ విషయంలో నమ్రత జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

పెన్నీ సాంగ్‌ తరహాలోనే ఓ స్థాయిలో పెన్నీ మేకింగ్‌ వీడియోను కూడా జనాలు ఆధరిస్తున్నారు. మహేష్‌ బాబు అఫిషియల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ లో ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది. భారీ ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమాకు ఈ పాట మరింత హైప్ ను క్రియేట్‌ చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు కూడా పెన్నీ సాంగ్‌ కు తనదైన శైలి స్టెప్పులతో అలరించాడు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్ తో సితార పెన్నీ సాంగ్‌ లో ఆకట్టుకోవడంతో పాటకు చాలా మంచి ఆధరణ లభిస్తుంది.

ఇక సినిమా ను ఈ సమ్మర్ చివర్లో మే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌ బాబు బ్యాంకింగ్‌ రంగంలో జరుగుతున్న అవినీతి గురించి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.


Full View

Tags:    

Similar News