విజయ్ దేవరకొండ.. అనన్య పాండే జంటగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. షూటింగ్ కార్యక్రమాలు రెండు మూడు నెలల క్రితమే ముగించేసిన దర్శకుడు పూరి సినిమాను ఆగస్టు లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్ కార్యక్రమాల సందడి మొదలు పెట్టబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.
ఈనెల 9వ తారీకున సాయంత్రం నాలుగు గంటల నుండి లైగర్ వేట ఆరంభం కాబోతుంది అంటూ పోస్టర్ ను విడుదల చేసి అంతటా కూడా చర్చనీయాంశం అయ్యారు. 9వ తారీకున ఏం విడుదల చేయబోతున్నాను.. ఏం సర్ ప్రైజ్ చేయబోతున్నారంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. కరోనా వల్ల చాలా గ్యాప్ రావడంతో అభిమానులు ఆగలేక పోతున్నారు.
షూటింగ్ పూర్తి అయ్యి ఇన్నాళ్లు అవుతున్నా ఆగస్టు వరకు ఎందుకు సినిమా ను ఆపుతున్నారు అంటూ చాలా మంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా లో బాక్సర్ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు టీజర్ తో ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు.
సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ మూవీ అనగానే యూత్ ఆడియన్స్ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారికి ఏమాత్రం నిరాశ పర్చకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమా ను ఛార్మితో కలిసి పూరి నిర్మించాడు. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈసినిమాను హిందీలో సమర్పిస్తున్నాడు. అంతే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడు. కనుక సినిమా పై మరింతగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ మరింత స్టార్ డమ్ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంత ముందుగానే ప్రారంభం అయితే విడుదల సమయం వరకు అంచనాలు ఆసక్తి భారీగా పెరిగే అవకాశం ఉంది. లైగర్ సినిమా విడుదలకు ముందే విజయ్.. పూరిల కాంబోలో మరో సినిమా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ గ్యాప్ లో శివ నిర్వాన దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కశ్మీర్ లో ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.