నాలుగో సినిమాకే 100 కోట్ల క్లబ్ హీరో? ఇది వినేందుకే ఎంతో గొప్పగా ఉంది కదూ? అవును.. ఇది సాధ్యం చేసి చూపించేందుకు రెడీ అవుతున్నాడు ట్యాలెంటెడ్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డిగా అతడు జనం మనసు ఏ రేంజులో దోచాడో ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఎవడే సుబ్రమణ్యం - పెళ్లి చూపులు సినిమాలు చేసినప్పుడు దేవరకొండకే బోలెడన్ని సందేహాలు. అసలు మన మైలేజీ ఎంత? అంటూ మదనపడే ఉంటాడు. కానీ ఇప్పుడిక మదనపడాల్సిన పనేలేదు. ష్యూర్ షాట్ స్టార్ హీరోగా డిక్లేర్ అయినట్టే. అతడిని సూపర్ స్టార్ అని పిలవడానికి మొహమాట పడొచ్చేమో కానీ, టాలీవుడ్ 88ఏళ్ల హిస్టరీలో ఇంతవరకూ ఏ హీరోకి సాధ్యపడని ఫీట్ ఇదని చెప్పాలి.
మారిన ట్రెండ్ లో - పెరిగిన మార్కెట్ స్ట్రాటజీలో దీనిని చూడాల్సిన పనేలేదు. ఎందుకంటే దేవరకొండ కంటే ముందు - దేవరకొండ తర్వాత వచ్చిన స్టార్లు ఎవరూ ఈ ఫీట్ ని ఇంత తేలిగ్గా సాధించి చూపించలేదు. ఇప్పటికే దేవరకొండ నటించిన `గీత గోవిందం` 75కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. దీనిని అల్లు కాంపౌండ్ ఎంతో ఘనంగా పోస్టర్ రూపంలో ఆవిష్కరించింది. దేవరకొండ 75కోట్ల గ్రాస్ హీరో అని ప్రకటించింది. ఇది ఓ రకంగా హీరోకి ఎంత పెద్ద బూస్ట్ నో చెప్పాల్సిన పనేలేదు. పనిలో పనిగా దేవరకొండపై ఒత్తిడి అంతే పెద్దగా ఉంటుందనడంలో సందేహం లేదు.
75కోట్ల నుంచి ఇక 100 కోట్ల క్లబ్ వైపు పరిగెత్తేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఈ సినిమా ఇప్పటికీ అదే స్పీడ్ లో ముందుకెళుతోంది కాబట్టి 100కోట్ల క్లబ్ దానంతట అదే పరిగెత్తుకొస్తుంది అన్న ధీమా చిత్రబృందంలో ఉంది. ఆ స్థాయిలో ఎమోషన్ - ఆ రేంజులో పెర్ ఫెక్ట్ కంటెంట్ ని ఎంచుకుని దేవరకొండను సూపర్ స్టార్ ని చేసిన ఘనత పరశురామ్ దేనని ప్రశంసించి తీరాలి. ఆ ఇద్దరినీ ఎంకరేజ్ చేసిన గీతా ఆర్ట్స్ సంస్థను పొగిడేయాలి. ఎదిగేవాళ్ల కాళ్లు పట్టుకుని లాగేసే ఈ ప్రమాదకర ప్రపంచంలో దేవరకొండను మెగా ఫ్యామిలీ ఎంకరేజ్ చేస్తున్న తీరుపైనా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇకపోతే తేరాస నాయకులు కేసీఆర్ - కేటీఆర్ - కవితక్క అందరూ ఇప్పుడు దేవరకొండకు బాగా చుట్టాలైపోయారు కూడా!!