డీఎండీకే అధినేత, తమిళ స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యం ఎలా ఉంది? అంటే.. ఎవ్వరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై చాలా కాలంగా సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కానీ.. కండీషన్ ఏంటనేది మాత్రం అటు కుటుంబ సభ్యులు కానీ.. ఇటు పార్టీ నాయకులు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు.
ఇవాళ (బుధవారం) ఉదయం 3 గంటల సమయంలో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారట. శ్వాసలో ఇబ్బందులు ఎదురుకావడంతో హుటాహుటిన తరలించినట్టు సమాచారం. దీంతో పార్టీ కార్యకర్తలతోపాటు పలువురు ఆందోళనకు గురయ్యారు. విజయ్ కాంత్ ఆరోగ్యం ఎలా ఉందోనని తెలుసుకోవాలని ప్రయత్నించారు.
అయితే.. సాయంత్రం వేళ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అందులో ఏముందంటే.. ఆయన రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి వెళ్లారట! ఇక్కడే పరిస్థితి సీరియస్ గా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉదయం 3 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లి.. రొటీన్ హెల్త్ చెకప్ అనడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని ఖచ్చితంగా దాస్తున్నారనే సందేహాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాగా.. కెప్టెన్ హెల్త్ కండీషన్ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. అభిమానులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడం గమనార్హం.