మిస్టర్ ఆగింది అందుకే!!

Update: 2016-05-25 04:24 GMT
బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత.. శ్రీను వైట్లకు మెగా ఫ్యామిలీ మరో ఛాన్స్ ఇచ్చింది. అదే వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేయడం. దీన్ని సక్సెస్ చేయగలిగితే.. అప్పుడు బన్నీ - చరణ్ లతో చేసే ఛాన్స్ ఇవ్వాలన్నది డీల్. అందుకే వరుణ్ తేజ్ తో 'మిస్టర్' ను ప్రతిష్టాత్మకంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని తీస్తున్నాడు శ్రీను వైట్ల.

నిజానికి ఈ 'మిస్టర్' ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. మే 15న స్పెయిన్ లో షూటింగ్ ప్రారంభించేస్తామంటూ.. అంతకు ఓ నెల్లాళ్ల క్రితమే ఆర్భాటంగా ఓ ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చింది యూనిట్. అయితే, ఇప్పటివరకూ ఒక్కరు కూడా స్పెయిన్ వెళ్లే ఫ్లైట్ ఎక్కలేదు. దీనికి తోడు ఈ మధ్య శేఖర్ కమ్ములతో వరుణ్ తేజ్ సినిమా మొదలు కాబోతోందంటూ ఓ టాక్ వచ్చింది. దీంతో 'మిస్టర్' విషయంలో వరుణ్ తేజ్ అసంతృప్తితో ఉన్నాడని.. ఆ ప్రాజెక్ట్ ఆపేసినట్లే అనే రూమర్స్ మొదలయ్యాయి.

అయితే.. ఇవేవీ వాస్తవం కాదు. వరుణ్ తేజ్- వైట్ల కాంబినేషన్ లో మూవీ ఖచ్చితంగా తెరకెక్కుంది. స్పెయిన్ షెడ్యూల్ ఈ పాటికే స్టార్ట్ కావాల్సి ఉన్నా.. యూనిట్ మెంబర్స్ కి ఇంకా స్పెయిన్ వీసా రాలేదట. షూటింగ్ విషయంలో లొకేషన్ పర్మిషన్స్ కూడా పూర్తిగా అందలేదని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం వీసాల కోసం వెయిట్ చేస్తోంది మిస్టర్ యూనిట్. ఒకసారి ఈ ప్రాబ్లెం క్లియర్ అయ్యాక... ఇక నాన్ స్టాప్ గా మిస్టర్ షూటింగ్ జరిపేలా ప్లాన్ చేశారు మిస్టర్ టీం.
Tags:    

Similar News