నేడే విశాల్‌ ఎంగేజ్మెంట్‌... వీరే గెస్ట్స్‌

Update: 2019-03-16 08:41 GMT
తమిళ స్టార్‌ హీరో, నడిగర్‌ సంఘం ప్రెసిడెంట్‌ అయిన విశాల్‌ హైదరాబాద్‌ కు చెందిన అనీషాతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరి ప్రేమ విషయం బయటకు రావడం ఇరు కుటుంబాల వారు పెళ్లికి ఓకే చెప్పి, పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయడం వంటివి చకచక జరిగిపోయాయి. చాలా కాలంగా విశాల్‌ నడిగర్‌ సంఘం భవనం పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ చెబుతూ వస్తున్నాడు. మరి కొన్ని నెలల్లో అది పూర్తి అవ్వబోతుంది. ఈ సమయంలో విశాల్‌ పెళ్లికి సిద్దం అయ్యాడు.

నేడు విశాల్‌, అనీషాల వివాహ నిశ్చితార్థం హైదరాబాద్‌ లోని ఒక ప్రముఖ స్టార్‌ హోటల్‌ లో జరుగుతోంది. ఈ నిశ్చితార్థం కు టాలీవుడ్‌ కు చెందిన గెస్ట్‌ లు ఎవరికి కూడా ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఇక ఇప్పటికే విశాల్‌ మరియు ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ కు చేరుకున్నారు. విశాల్‌ కుటుంబ సభ్యులు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమ నుండి ఖుష్బుతో పాటు నడిగర్‌ సంఘం మరియు తమిళ నిర్మాతల మండలి నుండి కొందరు ప్రముఖులు కూడా ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొనబోతున్నారు.

విశాల్‌ కు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే నిశ్చితార్థం చాలా నిరాడంబరంగా జరగాలనే ఉద్దేశ్యంతో ఎక్కువగా అతిథులను ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వివాహ తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.

టెంపర్‌ రీమేక్‌ 'అయోద్య' రీమేక్‌ షూటింగ్‌ సమయంలో విశాల్‌ గాయపడ్డట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో నిశ్చితార్థం కాస్త ఆలస్యం అవుతుందేమో అని భావించారు. కాని ఆ చిన్న ప్రమాదం నిశ్చితార్థంకు ఎలాంటి అడ్డు కాలేదు. 
Tags:    

Similar News