తమిళ స్టార్ హీరో విశాల్ - హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ లు ప్రేమించుకుంటున్నారు - త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అంటూ దాదాపు అయిదు సంవత్సరాలకు పైగా తమిళ మీడియాతో పాటు అప్పుడప్పుడు జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లి గురించి కేవలం తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా తెలుగు - కన్నడ పరిశ్రమల్లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరు మాత్రం ఇప్పటి వరకు ఓపెన్ కావడం లేదు. ఇన్ని వార్తలు వస్తున్నా ఎప్పుడు కొట్టి పారేయకపోవడంతో పాటు - ఇద్దరు కలిసి పదే పదే నటించడం - పలు కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారంను అంతా బలంగా నమ్ముతున్నారు.
ఇలాంటి సమయంలో వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ విశాల్ తో నాకు కేవలం స్నేహం మాత్రమే ఉంది. ఆ స్నేహం ఎప్పటికి అలాగే ఉంటుంది. పెళ్లి విషయంలో నేను పదే పదే విశాల్ కు చెబుతూనే ఉంటాను. త్వరగా పెళ్లి చేసుకో అని ఇప్పటికే విశాల్ కు సలహా ఇచ్చాను - ఇంకా ఆలస్యం అయితే పిల్లను ఎవరు ఇవ్వరు అని కూడా చెప్పాను అంటూ తాజాగా హైదరాబాద్ వచ్చిన సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాటాలతో విశాల్ తో ఆమె ప్రేమ వ్యవహారం నిజం కాదేమో అనిపించింది. కాని విశాల్ వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే ఇద్దరి మద్య ప్రేమ ఉందేమో అనిపించక మానదు.
తాజాగా ఒకానొక సందర్బంగా విశాల్ మాట్లాడుతూ.. వరలక్ష్మి నా సోల్ మేట్ - ఆమె పక్కన ఉంటే నేను చాలా సంతోషంగా - బలంగా ఉంటాను అన్నాడు. నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రకటించాడు. వరలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అంటూ స్వయంగా విశాల్ ప్రకటించలేదు - కాని ఆమె సోల్ మేట్ అంటూ ప్రకటించిన నేపథ్యంలో ఇద్దరి మద్య ప్రేమ ఉందనిపిస్తుంది. మొత్తానికి ఇద్దరు విరుద్ద ప్రకటనలు చేస్తున్న కారణంగా ప్రేమ ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పుడు ఎంత దాచినా - ఎంతగా బయట పడకుండా ఉండాలనుకున్నా కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే, ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ తమిళనాడుకు చెందిన కొందరు సినీ వర్గాల వారు అంటున్నారు. ఆ తరుణం అతి త్వరలోనే వస్తుందని తాము భావిస్తున్నామని విశాల్ అభిమానులు కూడా అంటున్నారు.