తమిళనాడు సినీ నిర్మాతల మండలి(టీఎఫ్ పీసీ) అధ్యక్షుడు - హీరో విశాల్ ....ఆర్కే నగర్ ఉప ఎన్నికల నామినేషన్ తిరస్కరణ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విశాల్ సమర్పించిన అఫిడవిట్ లో ఇద్దరు ప్రపోజర్లు తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని చెప్పడంతో ఆ నామినేషన్ ను తిరస్కరించినట్లు అధికారులు చెప్పారు. ఆ ప్రపోజర్లను కొందరు బెదిరించి కుట్రపూరితంగా ఈ విధంగా చేశారని విశాల్ ధర్నా చేయడం...అరెస్టవడం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మార్చడం.....వంటి ఘటనలు కలకలం రేపాయి. హైడ్రామా నడుమ విశాల్...ఆర్కే నగర్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా, ఆ ఘటనపై విశాల్ స్పందించారు. తన నామినేషన్ తిరస్కరణ ఘటన తనను మరింత బలవంతుడిని చేసిందని విశాల్ చెప్పారు.
రజనీకాంత్ - కమల్ ల రాకతో వచ్చే ఎన్నికల సమయానికి తమిళ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని విశాల్ అభిప్రాయపడ్డారు. రజనీ - కమల్ ల రాజకీయ అరంగేట్రాన్ని విశాల్ స్వాగతించారు. రాజకీయాలలోకి వారిద్దరూ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రిజల్ట్ ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా వారు సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయితే, ఇద్దరు అగ్ర నటులు ఎన్నికల బరిలో దిగితే....ప్రజలు ఎవరికి ఓటేస్తారో అన్నది ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. కానీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళ రాజకీయాల్లో తప్పక మార్పులు వస్తాయని, విశాల్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విశాల్ కూడా వీరిద్దరిలో ఒకరికి మద్దతు తెలిపి క్రియాశీల రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారని తమిళనాడులో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, విశాల్....డీఎంకే తరపున బరిలోకి దిగుతారని మరో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా...తమిళనాట రాబోయే ఎన్నికల్లో సినీ గ్లామర్ ఆధిపత్యం చలాయించనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.