తనూశ్రీ గొడవ.. ఆ డైరెక్టర్ దొరికిపోయాడు

Update: 2018-09-30 04:23 GMT
బాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఒకప్పటి హీరోయిన్ తనూశ్రీ దత్తా.. బాలీవుడ్ ప్రముఖులపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలే. లెజెండరీ యాక్టర్ నానా పటేకర్ మీద ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆయన తర్వాత తనూశ్రీ టార్గెట్ చేసిన వ్యక్తి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ‘చాక్లెట్’ అనే సినిమా చిత్రీకరణ సందర్భంగా ఇర్ఫాన్ ఖాన్ మీద తీసే సన్నివేశం కోసం తనను బట్టలు విప్పి నిల్చోమని వివేక్ చెప్పాడని.. తనతో అసభ్యంగా కూడా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలపై వివేక్ మౌనం వహిస్తున్నాడు. ట్విట్టర్లో చాలా యాక్టివ్‌ గా ఉండే వివేక్.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. ఐతే వివేక్ ను సోషల్ మీడియాలో జనాలు గట్టిగానే తగులుకుంటున్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన వివేక్.. ఈ ఏడాది ఏప్రిల్లో చేసిన ఒక ట్వీట్ ను ఇప్పుడు రీట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు. అప్పట్లో కథువా అనే అమ్మాయి రేప్ కు వ్యతిరేకంగా హీరోయిన్లు ప్లకార్డులతో ఫొటోలు పెట్టారు. దీనిపై వివేక్ సెటైర్లు వేశాడు. కథువా విషాదం నేపథ్యంలో హీరోయిన్లు ప్లకార్డులు పట్టుకోవడం బాగానే ఉందని.. ఐతే బాలీవుడ్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల్ని వ్యతిరేకిస్తూ కూడా వాళ్లు ప్లకార్డులు పట్టుకుంటే బాగుంటుందని వివేక్ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. అంతే కాక హీరోయిన్లను సినిమాల్లో సెక్స్ వస్తువుల్లా చూపించడాన్ని వ్యతిరేకిస్తూ.. అలాంటి పాత్రల్ని కూడా తిరస్కరించడానికి సిద్ధమా అని కూడా ప్రశ్నించాడు వివేక్. ఈ ట్వీట్ ను గుర్తు చేస్తూ తనపై జరిగిన లైంగిక వేధింపులపై తనూశ్రీ స్వయంగా వివేక్ ను ప్రశ్నిస్తుంటే అతను ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్నారు నెటిజన్లు. కానీ వివేక్ మాత్రం సైలెంటుగా ఉన్నాడు.

Tags:    

Similar News