వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన `ది కాశ్మీర్ ఫైల్స్` మార్చి 11న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ తో పోటీపడుతూ రిలీజై పాజిటివ్ సమీక్షలతో ఘనవిజయం అందుకుంది. అయితే పరిమిత స్క్రీన్ లలో మాత్రమే రిలీజైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా స్క్రీన్ల కౌంట్ పెరిగింది. ఈ చిత్రం తన అసాధారణ ప్రదర్శనతో బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆశ్చర్యపరిచింది.
సినిమా విజయం తర్వాత వివేక్ అగ్నిహోత్రి .. నటుడు పల్లవి జోషి ఢిల్లీలో ఈ చిత్రం కోసం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ వారు తమ చిత్రం సాధించిన విజయం గురించి మాట్లాడారు. విలేఖరుల సమావేశంలో అగ్నిహోత్రి మాట్లాడుతూ.. సినిమా విజయాన్ని తన పేరుతో ముడిపెట్టవద్దని వివేక్ అందరినీ అభ్యర్థించారు. "నాపై మీకు కొంచెం గౌరవం ఉన్నా సినిమా విజయాన్ని నాతో ముడిపెట్టవద్దు" అని రెక్వస్ట్ చేశారు. "నేను ఒక చిన్న పట్టణం నుండి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నాకు ఇంగ్లీష్ కూడా రాదు. నేను గురువుగారి కొడుకుని. సక్సెస్ పై నాకు పెద్దగా అవగాహన లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఇదివరకటిలా అదే వ్యక్తిగా కొనసాగుతాను" అని అతను చెప్పాడు.
“అయితే ఇది ఎవరి విజయం? ఈరోజు మేము ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు సెక్యూరిటీ గార్డు ముఖంలో తన బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ముఖంలో కనిపించే అదే ఆనందాన్ని చూశాము. విమానాశ్రయంలో బండ్లు నడుపుతున్న వ్యక్తులు లేదా స్టార్ బక్స్ లో సేవ చేసే వ్యక్తులు కూడా మా ఉనికికి ప్రతిస్పందించారు. కానీ కోట్లు సూట్లు వేసుకున్న ఎలైట్ వ్యక్తులు మమ్మల్ని చూస్తారు.. గుర్తిస్తారు.. కానీ ఏమీ అనరు. కొంతమంది ఆనందంతో మా దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చేవారు. ఈ విజయం నా ఒక్కడిది కాదు అని క్లారిటీగా రికార్డ్ లో పెట్టాలనుకుంటున్నాను. నాపై మీకు కాస్త గౌరవం ఉన్నా సినిమా విజయాన్ని నాతో ముడిపెట్టకండి. నేను ఒక మాధ్యమం మాత్రమే. సరస్వతీ దేవి అనుగ్రహంతోనే ఇలాంటివి జరుగుతాయి. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా దీని వెనుక దైవశక్తి ఉంది. నేను దానిని నమ్ముతాను.
సినిమా విషయానికొస్తే.. ఇది కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ పండిట్ల వలస కథను చూపిస్తుంది. ఇందులో అనుపమ్ ఖేర్- మిథున్ చక్రవర్తి- దర్శన్ కుమార్ - పల్లవి జోషి తదితరులు నటించారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆర్టిస్టులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.