బాలీవుడ్ లో వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సరే.. బెస్ట్ యాక్టర్ సహా కీలక అవార్డులన్నీ హిందీ హీరోలకే వెళతాయి? ఎందుకంటే అదంతా బాలీవుడ్ మాఫియా మరీ. అందుకే అక్కడి జనాలకు వాళ్ల హీరోలంటే వెగటు పుట్టి కంటెంట్ ఉన్న దక్షిణాది సినిమాలను ఆదరిస్తున్నారు. హిట్ చేస్తున్నారు. తాజాగా కశ్మీర్ ఫైల్స్ తో దేశంలో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ బాలీవుడ్ మాఫియాపై సంచలన కామెంట్స్ చేశారు.
సైలెంట్ గా విడుదలై వైలెంట్ గా హిట్ అయిన మూవీ ‘కశ్మీర్ ఫైల్స్’. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ తోపాటు దేశవ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. ఈ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో సమస్యలు, బాలీవుడ్ పై తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ.. అక్కడ అవార్డులపై వివేక్ సంచలన కామెంట్స్ చేశారు. వివేక్ తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘బాలీవుడ్ అవార్డ్స్ మాఫియా ఎలా పనిచేస్తుందో తెలిసి షాక్ అయ్యాను. ఒక సంవత్సరం ఒక కలర్ ఫుల్ స్టార్ హీరో తీసిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ప్రేక్షకులు తిరస్కరించినప్పటికీ మొత్తం 10+ అవార్డులను అతడే పొందగలిగాడు. అవార్డులలో బాలీవుడ్ మాఫియా ఎంత ఉంటుందో అవార్డులను అమ్మకం గురించి కనుక్కుంటే తెలుస్తుంది. ఈ విషయంలో అందరికీ తెలిసినా అందరూ మౌనంగా ఉంటారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక అంతటితో ఆగకుండా నెటిజన్లు ఈ విషయంలో స్పందించాలని.. బాలీవుడ్ లో అవినీతి అవార్డ్స్ మాఫియాపై మీ గొంతెత్తాలంటూ వివేక్ పిలుపునిచ్చారు. అసలే ఇలాంటి విషయాల్లో పిలుపునివ్వకున్నా రెచ్చిపోయే నెటిజన్లు ఇప్పుడు స్పందించాలనే సరికి పెంటపెంట చేస్తున్నారు. ‘ఆ కలర్ ఫుల్ హీరో రణ్ వీర్ సింగ్’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ప్రపంచంలోనే అతిపెద్ద మాఫియా బాలీవుడ్ అంటూ ఇంకొకరు ఇలా వివేక్ ట్వీట్ తో ఇప్పుడు బాలీవుడ్ షేక్ అయ్యేలా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
మొత్తంగా తన కసిని, బాలీవుడ్ లోని అవినీతిని వివేక్ కాస్త గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికే కశ్మీర్ ఫైల్స్ తీసిన దర్శకుడు బాలీవుడ్ మాఫియాపైన కూడా సినిమా తీస్తాడా? ఏంటి? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.