మెగాస్టార్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సైరా సినిమా మొదలవ్వడానికి ముందు చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని రీసెంట్ గా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే వాటిలో ఏది ఎంత వరకు నిజం అనే విషయాన్ని పక్కనపెడితే సైరా దర్శకుడు మొదట సురేందర్ రెడ్డి కాదని తెలిసింది. చిరంజీవి 150వ చిత్రాన్ని చేసిన కమర్షియల్ దర్శకుడు వివి.వినాయక్ ఆ కథకు దర్శకుడిని చేయాలనీ మెగా తనయుడు మారోసారి ఆలోచించాడట.
కానీ వినాయక్ అందుకు మొదట సానుకూలంగా నిర్ణయాన్ని తెలిపినప్పటికీ ఆ తరువాత మెల్లగా తప్పుకున్నాడట. మెగాస్టార్ తో వర్క్ చేయాలంటే ఏ దర్శకుడికైనా చాలా నచ్చుతుంది. ముఖ్యంగా వినాయక్ పెద్ద ఫ్యాన్ కాబట్టి ఆ ఛాన్స్ అస్సలు వదులుకోడు. అయితే ముందుగా ఏ దర్శకుడైన ఒక కథను తనకు తాను అర్ధం చేసుకొని ఒక విజన్ ని క్రియేట్ చేసుకోవాలి. అందులోను చారిత్రాత్మక సినిమా కాబట్టి గ్రాఫిక్స్ తో కూడుకున్నది కావున కథను అర్ధం చేసుకోవాలంటే సమయం చాలానే పడుతుంది.
వినాయక్ తాను తెరకెక్కించబోయే ఏ కథనైనా సరే 6 నెలల వరకు స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉంటాడు. ఆ విధంగా సైరా సినిమాకు కూడా చేస్తే మెగాస్టార్ ని చాలా వెయిట్ చేయించాలి. ఆ కారణం వల్ల వినాయక్ తప్పుకున్నాడట. అలాగే సురేందర్ రెడ్డి కూడా వినాయక్ కు మంచి మిత్రుడు కావడంతో అతను అయితే బాగా చేస్తాడని చరణ్ కు ముందు నుంచి చెబుతూనే ఉన్నాడని తెలుస్తోంది. అది సంగతి.