షూటింగులు ఆపం.. మా ఆర్టిస్టుల్ని తాకిన క‌రోనా సెగ

Update: 2020-03-06 12:30 GMT
ఇప్పుడు ఏ నోట విన్నా క‌రోనా వైర‌స్ మాటే.. కొద్ది రోజుల్లోనే ప్ర‌పంచాన్ని చాప చుట్టేసిన ఈ వైర‌స్ క‌ల్లోలం ఆషామాషీగా లేద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఈ వైర‌స్... ప్రస్తుతం భార‌త‌దేశంలోకి
ప్ర‌వేశించింది. తాజాగా తెలంగాణలోనూ ఒక కేసు న‌మోద‌వ‌డంతో అంతటా హ‌డ‌లెత్తిపోతున్నారు. జ‌న స‌మ‌ర్థం ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశాల్లోకి వెళ్లాలంటే ప్ర‌తి ఒక్క‌రూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమాల‌పైనా ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని గ్ర‌హించిన మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) హుటాహుటీన మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. అన్ని సినిమా థియేట‌ర్ల‌లో యాంటీ క‌రోనాకు సంబంధించిన ప్ర‌త్యేకమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. హ్యాండ్ వాషింగ్‌కు అద‌న‌పు ఏర్పాటు చేయాల‌ని మా మీడియా ముఖంగా కోరింది.

సినిమా థియేట‌ర్ల‌కు వచ్చే వారికి క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించేలా.. వారికి ర‌క్ష‌ణగా ఉండేలా చూడాల‌ని చెప్పింది. ఇదే స‌మ‌యంలో విడుద‌లైన అన్ని సినిమాల‌ను విజ‌యవంతం చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరింది. క‌రోనా వైర‌స్ కారణంగా వ‌స్తున్న రూమ‌ర్ల‌ను ఈ సంద‌ర్బంగా ఖండించింది. కొన్ని సినిమాలు వాయిదా ప‌డుతున్నాయ‌ని అనేక పుకార్లు వ‌స్తున్నాయ‌ని... ఇది ఎంత మాత్రం నిజం కాద‌ని స్ప‌ష్టం చేసింది. క‌రోనా వైరస్ గురించి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ‌కుండా థియేట‌ర్ల‌కు వెళ్లాల‌ని సూచించింది.

అయితే ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌లు రావ‌డంతో కొంత సినిమాల‌కు ఇబ్బందులు ఉంటాయ‌ని.. ఇదేమీ పెద్ద
ఇబ్బంది కాద‌ని మా కార్య‌వ‌ర్గం చెప్పుకొచ్చారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ ల‌కు బంద్ అని వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని వారు స్ప‌ష్టం చేశారు. షూటింగ్ లు నిరాకాట‌కంగా సాగుతాయ‌ని వెల్ల‌డించారు. అయితే క‌రోనా ప్ర‌భావంతో ఏ ప్ర‌మాదం ముంచుకొస్తుందోన‌నే ఆందోళ‌న‌ మా అసోసియేష‌న్ ఇలా బ‌య‌ట పెట్టింద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. ఒక‌వేళ షూటింగులు బంద్ అయితే ప్ర‌త్య‌క్షం గా మా స‌బ్యులు 800 మందికి.. అలాగే ఇత‌ర ఆర్టిస్టుల సంఘాలు క‌లుపుకుని దాదాపు 10 వేల మందికి పైగా ఉపాధిని కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News