హీరో రాజశేఖర్ కార్ ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణం వేగంగా వస్తున్న కార్ టైర్ బరస్ట్ అవ్వడమేనని జీవిత రాజశేఖర్ తాజాగా వీడియో బైట్ ద్వారా వివరణ ఇచ్చారు. కార్ ప్రమాదం జరిగిన వెంటనే వేరొకరు రాజశేఖర్ ని కాపాడారు. కార్ లోంచి బయటికి లాగారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు.
అయితే ఇది నిజమా? అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి? వేరొక కోణం ఏదీ లేదా? అంటే టీవీ చానెల్ రిపోర్ట్స్ వేరేగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్ 150కి.మీటర్లు పైగా వేగంతో దూసుకొస్తోంది.
కార్ డివైడర్ ని ఢీకొని డివైడర్ పైనుంచి వేరొక వైపుగా ఎగిరిపడిందని పోలీసులు చెబుతున్నారని రిపోర్ట్ రావడం ఆశ్చర్యపరుస్తోంది.
అంతేకాదు.. కార్ లో మద్యం బాటిల్స్ ఉన్నాయని పోలీసులు గుర్తించారని మరో రిపోర్ట్ షాక్ కి గురి చేస్తోంది. కానీ జీవిత.. రాజశేఖర్ చెబుతున్న స్టేట్ మెంట్ వేరుగా ఉంది. ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు అనంతరం పోలీసులే అసలు నిజాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. కార్ లో మద్యం బాటిల్ ఉంది అని పోలీసులు చెబుతున్నారు కాబట్టి ఆ కోణంలో దర్యాప్తును సాగిస్తున్నారు. రాజశేఖర్ మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నారా? అన్నదానిపైనా విచారణ సాగుతోందని సమాచారం. ఇక 2017లోనూ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపే రాజశేఖర్ కార్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పట్లోనే తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. రెండో సారి ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదం నుంచి బయటపడడం అదృష్టమేనని అభిమానులు భావిస్తున్నారు.
Full View