మహమ్మారి క్రైసిస్ లో ప్రారంభించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పై మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి. ఈసారి షో ప్రేక్షకులను అంతంత మాత్రమే అలరించగలిగింది. ఈ రియాలిటీ ప్రదర్శన ఈరోజు (డిసెంబర్ 20) గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది. గెస్ట్ షోలు.. డ్యాన్సింగులు.. ప్రత్యేక ప్రదర్శనలతో ఈ రాత్రి జరిగే ఈవెంట్ కి ప్రత్యేక కళ తేనున్నారు. అయితే ఈ నైట్ ప్రత్యేకతలు ఏమిటి? అన్నది ఆరాతీస్తే..
గ్రాండ్ ఫైనల్ లో ముగ్గురు ఫైనలిస్టులను తొలగించనున్నారు. బిగ్ బాస్ సాంప్రదాయం ప్రకారం.. ముందుగానే వారికి టోకెన్ అమౌంట్ మొత్తాన్ని అందించే అవకాశం ఉంది. వారు కోరుకుంటే నిష్క్రమించమని కోరతారు. ఫైనలిస్టులలో ఈసారి ఈ ఎంపికకు ఎవరైనా `ఎస్` చెబుతారేమో చూడాలి. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ను ఎవరు గెలుస్తారు? అన్న పోలింగ్ నడుస్తోంది. అభిజీత్ -అలేఖ్య హరిక -అఖిల్ సార్థక్- సయ్యద్ సోహెల్ ర్యాన్- అరియానా కీర్తి .. వీళ్లలో ఎవరు? అన్నది చూడాలి.
ఈసారి షోలో.. రాయ్ లక్ష్మి అదిరిపోయే నృత్య ప్రదర్శనతో డ్యాన్స్ ఫ్లోర్ పై అగ్గిరాజేయనుంది. `ఖైదీ నెంబర్ 150` లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె డ్యాన్స్ నెంబర్ `అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు` అంటూ స్టెప్పులేసిన సంగతి తెలిసినదే. ఈ పాటకు రాయ్ లక్ష్మీ డ్యాన్సులు చేయనుంది. అంతేకాకుండా ఎఫ్ 2తో హీట్ పెంచిన బ్యూటీ మెహ్రీన్ పిర్జదా కూడా తన ప్రత్యేక నృత్యంతో అభిమానుల్ని ఓలలాడించనుంది.
ఈ రాత్రి జరిగే గ్రాండ్ ఫైనల్ లో కమ్ముల `లవ్ స్టోరి` స్టార్లు నాగ చైతన్య- సాయి పల్లవి ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నారు. ఈ జంట ఫైనలిస్టులతో సంభాషించడంతో పాటు.. వారి సినిమా ప్రమోషన్ చేసుకుంటారని తెలుస్తోంది. కొంతమంది ఫైనలిస్టులను కూడా తొలగించే పనిని వారికి అప్పగించే అవకాశం ఉంది.
ట్యాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ తమన్ చాలా కాలం తర్వాత బుల్లితెరపై కనిపించనున్నారు. దాదాపు 9 నెలల తర్వాత బిగ్ బాస్ రియాలిటీ గ్రాండ్ ఫైనల్ కోసం ఒక ప్రత్యేక సంగీత కచేరీలో ప్రదర్శన ఇస్తాడు. తమన్ ఇటీవల తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇదే విషయాన్ని ధృవీకరించారు.
మెగాస్టార్ చిరంజీవి కొణిదెల మరోసారి ముఖ్య అతిథిగా బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ కు హాజరుకానున్నారు. అతను మాజీ పోటీదారులు ఫైనలిస్టులతో సంభాషించి బిగ్ బాస్ 4 విజేతను ప్రకటించి వారికి ట్రోఫీ అలాగే ప్రైజ్ మనీని అందజేస్తారు. బిబి తెలుగు సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయిన సంగతి తెలిసిందే. నాటి ఎపిసోడ్ బంపర్ టీఆర్పీని రాబట్టడంలో చిరు స్టైల్ స్పాంటేనియస్ హ్యూమర్ టచ్ పెద్దగా సహకరించింది. ఇప్పుడు మరోసారి అది రిపీట్ కానుంది. ఫైనల్ షూట్ ఈ మధ్యాహ్నం కిక్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. సాయంత్రం 5 నుంచి బిగ్ బాస్ అభిమాన జనం టీవీలకు అతుక్కుంటారు.