డాక్టర్ కాబోయి యాక్టర్ అవ్వడం.. యాక్టర్ కాబోయి డాక్టర్ అవ్వడం.. ఇదంతా ఫేట్. ఇప్పుడు డాక్టర్లను యాక్టర్లు పెళ్లాడేస్తుండడం కూడా ఫేట్ అనే చెప్పాలి. హీరో నిఖిల్ ఓ డాక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాడని ఇటీవల రివీలైంది. నిఖిల్ పెళ్లి ముచ్చట వినిపిస్తుండగానే.. మరో ఎలిజిబుల్ బ్యాచిలర్.. హీరో నితిన్ కూడా ఓ డాక్టర్ నే పెళ్లాడబోతున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది.
గత కొంతకాలంగా నితిన్ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నా ఏ వివరం తెలియలేదు. ఆ క్రమంలోనే వధువు ఎవరు? వృత్తి ఏమిటి? కుటుంబ వివరాలేమిటి? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే వధువుకు సంబంధించిన ఏ వివరం ఇంతవరకూ బయటకు తెలియడం లేదు. హీరో నితిన్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని కాకుండా.. ఒక ట్రెడిషనల్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన యువతిని పెళ్లాడుతున్నారట. అమ్మాయి వృత్తిరీత్యా డాక్టర్ అని తెలుస్తోంది. తన కుటుంబానికి సంబంధించిన వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయిట.
సెలబ్రిటీ వెడ్డింగ్స్ అంటే అభిమానుల్లో హంగామా ఎక్కువగానే ఉంటుంది. పరిశ్రమ వర్గాల్లోనూ అది హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఎలాంటి గడబిడ లేకుండా సైలెంట్ గా ఓ డీసెంట్ ఎఫైర్ లా పెళ్లి వేడుక ఉండాలని భావించేవాళ్లే ఎక్కువ. నితిన్ ఫ్యామిలీ కూడా అలానే ఆలోచిస్తోందట. ఈ సన్నివేశం చూస్తుంటే ఏమాత్రం హడావుడి లేకుండా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో డెస్టినీ వెడ్డింగ్ ని ప్లాన్ చేస్తున్నారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 15న నితిన్ వివాహం జరగనుందని ఓ సమాచారం తాజాగా రివీలైంది. ఈలోగా ఇంకా ఏవైనా వివరాలు తెలుస్తాయేమో చూడాలి. భీష్మ- రంగ్ దే సహా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోని సినిమా నితిన్ క్యూలో ఉన్న సంగతి తెలిసిందే.