కరోనా మహమ్మారి కారణంగా గత నాలుగు నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ అన్నీ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సినీ నిర్మాతలు థియేటర్స్ ఓనర్స్ ఎక్సిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా నష్టాలను చవిచూస్తున్నారు. అయితే కరోనా సంక్షోభ సమయంలో థియేటర్స్ రీ ఓపెన్ చేయడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో ఎవరూ మాట్లాడటం లేదు. షూటింగులకు అనుమతులివ్వమని ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు కానీ థియేటర్స్ పునఃప్రారంభించడంపై ఎవరూ కామెంట్స్ చేయలేదు. అయితే ఆ మధ్య రెండు సార్లు థియేటర్స్ తెరిచే విషయంపై చర్చ జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది సినిమా థియేటర్స్ ఆగస్టు నెలలో రీ ఓపెన్ చేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ సిఫారసు ప్రతిపాదనలు పంపించింది.
కాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ దీనిపై థియేటర్ల యజమానులతో మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో 50% సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు రీ ఓపెన్ చేస్తామని థియేటర్స్ మరియు మల్టీప్లెక్స్ ఓనర్స్ ప్రతిపాదించగా సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ పాటిస్తూ 25% సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవొచ్చని కేంద్రం సూచించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో థియేటర్స్ రీ ఓపెనింగ్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. మెజారిటీ సభ్యులు ప్రభుత్వం సూచించిన విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్ లు ప్రభుత్వ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొని థియేటర్స్ తెరవడానికి రెడీగా ఉన్నప్పటికీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రం దీనికి సిద్ధంగా లేరని సమాచారం. 25 శాతం సీటింగ్ కెపాసిటీ అంటే ఒకప్పుడు వచ్చే ఆదాయంలో 75 శాతం కోత పడుతున్నట్లేనని.. ఇక సెఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కనుక ఇదొక అదనపు భారమని.. థియేటర్స్ రెంట్స్ మరియు కరెంటు బిల్లులు ఎప్పటిలాగే చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారట.
ప్రొడ్యూసర్స్ సైతం దీని గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారట. సినిమాకి పెట్టిన బడ్జెట్ తిరిగొచ్చేది ఓపెనింగ్స్ వల్లనే. ఇప్పుడు 25% సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమా రిలీజ్ చేస్తే పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశం లేదని.. అందులోనూ రిలీజైన నెక్స్ట్ డే పైరసీ సైట్స్ లో సినిమా అందుబాటులో ఉంటున్న ఈ రోజుల్లో తక్కువ కెపాసిటీతో సినిమా ప్రసారం చేయడం అంటే నిర్మాత మరింత నష్టాల్లో కురుకుపోవడమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. టాలీవుడ్ లో థియేటర్స్ కలిగియున్న ప్రొడ్యూసర్స్ సైతం ఆగస్టులో థియేటర్స్ రీ ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. కొందరు మాత్రం 50 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిస్తే ఆలోచించవచ్చని అంటున్నారట. మరికొందరైతే రోజురోజుకి కేసులు పెరుగుతున్న ఈ సమయంలో థియేటర్స్ తెరిచినా ప్రేక్షకులు లైఫ్ రిస్క్ చేసి థియేటర్లకి వస్తారా?, ఒకవేళ వచ్చినా ఒక్కరికి కరోనా సోకినా అన్ని థియేటర్లకు ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద 25% సీటింగ్ ఆక్యుపెన్సీతో ఆగస్టు నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ రీ ఓపెన్ చేయడానికి సంకోచిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.