ఏపీ ఫిలిం-టీవీ అభివృద్ధి ఛైర్మ‌న్ ఎవ‌రు?

Update: 2019-06-02 04:52 GMT
ఏపీ టాలీవుడ్ గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంటుంది. ఏపీ- తెలంగాణ విభ‌జ‌న‌ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ (ఏపీ)లో ఒక కొత్త సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందాల‌ని సినీపెద్ద‌లంతా చాలానే ప్ర‌య‌త్నించారు. మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో మంత‌నాలు సాగించారు. అయితే ఏపీ టాలీవుడ్ పై కొన్ని ప్రామిస్ లు చేసినా.. దానిని ఆ త‌ర్వాత గాలికి వ‌దిలేశార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొత్త టాలీవుడ్ పై దృష్టి సారించేంత స‌మ‌యం చంద్ర‌బాబుకు చిక్క‌లేద‌ని.. ఆ దిశ‌గా నిజాయితీ క‌నిపించ‌లేద‌ని ఆయ‌న చుట్టూ తిరిగిన‌ సినీపెద్దలే తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఏపీ డివైడ్ త‌ర్వాత విజ‌య‌వాడ కేంద్రంగా ఫిలింఛాంబ‌ర్ - ఏపీఎఫ్‌ డీసీ (ఫిలింటీవీ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్) యాక్టివిటీస్ మ‌రింత‌గా పెరిగాయి. అంబికా కృష్ణ ఏపీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్ గా అంతో ఇంతో యాక్టివ్ గా ఉంచే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ సినిమా - టీవీ - నాటక రంగ అభివృద్ధి సంస్థ(ఎఫ్ డిసి) చైర్మన్ పదవికి అంబికా కృష్ణ రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు. ఆ క్ర‌మంలోనే ఈసారి ఆ ప‌ద‌వికి ఎవ‌రిని ఎంపిక చేస్తారు? అంటూ సినీవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఎలానూ  కొత్త ప్రభుత్వం తమ పార్టీకి చెందిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తుంది. అందులో ఈసారి సినిమా- టీవీ రంగానికి ఊత‌మిచ్చే కీల‌క‌మైన‌ ఏపీఎఫ్‌ డీసీ ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంది? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు.

ఈసారి ఏపీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్ గా న‌టుడు విజ‌య్ చందర్ కి అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆయ‌న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కి వీరాభిమాని. తొలి నుంచి ఆయ‌న వైకాపా వెంట ఉన్నారు. అందువ‌ల్ల అత‌డిని కొత్త సీఎం జ‌గ‌న్ ఏపీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్ గా నియ‌మిస్తార‌ని భావిస్తున్నారంతా. అలాగే ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. జీవిత రాజ‌శేఖ‌ర్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నా.. మెజారిటీ ఛాయిస్ విజ‌య్ చంద‌ర్ కే ఉంటుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఎస్వీ కృష్ణారెడ్డి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా పేరుంది. అందువ‌ల్ల ఆయ‌న్ని ఛాన్స్ వ‌రిస్తుందా? అంటూ విశ్లేషిస్తున్నారు. ఈసారి ఎఫ్ డీసీ ఛైర్మ‌న్ గా ఎవ‌రు ఎన్నికైనా అత‌డి ముందు బిగ్ ఛాలెంజ్ ఉంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీ టాలీవుడ్ ఆశ నీరుగారిపోయింది. అస‌లు కొత్త ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేస్తారా లేదా?   వినోద‌రంగాన్ని - సినిమాని గాలికి వ‌దిలేస్తారా? అంటూ యూత్ ఒక‌టే సీరియ‌స్ గా ముచ్చ‌టించుకుంటున్నారు. ముఖ్యంగా వైజాగ్ టాలీవుడ్ విష‌య‌మై ఉత్త‌రాంధ్ర‌- వైజాగ్ బెల్ట్ లో ఇప్ప‌టికే బోలెడంత ప్ర‌చారం సాగిపోయిన నేప‌థ్యంలో యూత్ లో ఇది రెగ్యుల‌ర్ హాట్ టాపిక్ గా మారింది. అందుకే ఎఫ్ డీసీకి కొత్త‌ ఛైర్మ‌న్ గా ఎవ‌రికి ఛాన్స్ ద‌క్కినా ఏపీ టాలీవుడ్ కి ఊపు తేవాల్సి ఉంటుంద‌న్న ముచ్చ‌ట సాగుతోంది.


Tags:    

Similar News