సాహో విడుదలకు ముందు ఆ చిత్రం గురించి హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎంత గొప్పగా చెప్పిందో తెలిసిందే. ప్రభాస్‌తో కలిసి పని చేయడం గురించి.. ఇంత పెద్ద సినిమాలో భాగం కావడం గురించి చాలా ఎగ్జైట్ అయింది. ప్రమోషన్లలో కూడా హుషారుగా పాల్గొంది. కానీ రిలీజ్ తర్వాత ఆమె అడ్రస్ లేదు. ఎక్కడా సాహో గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. తాజాగా ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సాహో గురించి హోస్ట్ ప్రశ్నలు అడిగితే ఆమె స్పందించిన తీరు విస్మయం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.
ఎదురుగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు కూర్చుని ఉండగా వేదిక మీద హోస్ట్ సాహో సినిమాలో నటించడంలో మీ అనుభవం చెప్పండి అని అడిగాడు. దానికామె బదులివ్వకుండా.. ఆడియన్స్ వైపు చూసింది. వాళ్లను పలకరించింది. వాళ్లు నాతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు అంటూ సంబంధం లేకుండా మాట్లాడింది. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన హోస్ట్ సాహో గురించి చెప్పండి అని మళ్లీ అడిగాడు. మళ్లీ ఆమె ప్రేక్షకుల వైపు చూసింది. వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. ఎవరో ఐలవ్యూ అంటే లవ్యూ టూ అని బదులిచ్చింది. హోస్ట్ మళ్లీ గ్యాప్ ఇచ్చాడు. సాహో గురించి చెప్పమన్నాడు. సాహో? అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టిన శ్రద్ధ.. ఆడియన్స్ వైపు చూస్తూ మీరంతా చిచ్చోరే సినిమా చూశారా అని అడగడం గమనార్హం. సాహో సినిమా అంచనాలు అందుకోకపోయినా.. ముందు అంతగా గొప్పలు పోయిన చిత్రం గురించి ఇప్పుడు రెండు ముక్కలు మాట్లాడటానికి శ్రద్ధకు అంత బాధేంటో?