బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరు? ఐదుగురిలో ఎవరు గెలుస్తారు? నేటి సాయంత్రం గ్రాండ్ ఫైనల్ లో తేలనుంది. అభిజీత్ -అఖిల్ సార్థక్- సయ్యద్ సోహెల్ ర్యాన్- అరియానా- హారిక .. వీళ్లలో ఎవరు? అన్నది అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది.
అయితే ప్రతిసారీ బిగ్ బాస్ ఇంట్లో ప్రేమకథలే కీ పాయింట్ గా మారాయి. లవ్ స్టోరి బ్రేకప్ దాని చుట్టూ ఎమోషన్స్ అలాగే ప్రేమికుడి వ్యక్తిత్వం ఆధారంగా ఓటింగ్ వ్యవహారం నడుస్తోంది. ఇక ప్రేమకథ వల్లనే చివరి వరకూ ఇంటి సభ్యురాలిగా కొనసాగే అవకాశం అమ్మాయిలకు కలుగుతోంది. ఓసారి బిగ్ బాస్ అన్ని సీజన్లను పరిశీలిస్తే..
బిగ్ బాస్ 2 విజేత కౌశల్ పై సింపథీ వర్కవుటైంది.. కౌశల్ కి పెళ్లయింది కాబట్టి లవ్ ట్రాక్ లేదు. ఇక ఇంట్లో సమస్యాత్మకంగా ఉండేవాళ్లు కౌశల్ ని దూరం పెట్టడం బయట సింపథీ ఓటింగ్ రూపంలో వర్కవుటైంది. చివరికి అదే అతడిని విజేతగా నిలబెట్టింది.
బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పైనా సింపథీ వర్కవుటైంది.. సీజన్ 4 ప్రేమ గువ్వలు అభిజీత్ - మోనాల్ లానే .. రాహుల్ - పునర్నవి మధ్య లవ్ స్టోరి ఎమోషన్ క్రియేట్ చేసింది. పున్నూతో ప్రేమలో పాపం పసోడు ఎపిసోడ్లు పండడం గాయకుడిగా ట్యాలెంట్.. నిజాయితీగా ఆడే తత్వం రాహుల్ ని గెలుపు వైపు నడిపించాయి.
బిగ్ బాస్ 4లో మోనాల్ తో అభిజీత్- అఖిల్ ముక్కోణపు ప్రేమకథ హైలైట్. ఇందులో మోనాల్ జిత్తులమారి గా మారి అభిజీత్ కి హ్యాండిచ్చి అఖిల్ కి చేరువవ్వడం వగైరా విషయాలు జనాల్లో అభిజీత్ పై సింపథీ ని పెంచి అవి ఓటింగ్ రూపంలోకి మారాయి. అలాగే విజేతల వ్యక్తిత్వం కామన్ గా అందరికీ నచ్చింది. రాహుల్ (సీజన్ 3)... లానే అభిజీత్ కి (సీజన్ 4) ఇది కామన్ గా పెద్ద ప్లస్ అవుతోంది. ఈ సీజన్ లో అభిజీత్ గెలుస్తాడు! అన్న ప్రచారం అంతటా ఉత్కంఠ పెంచుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఫైనల్ పోటీ అభిజీత్ - అఖిల్ - సోహైల్ మధ్యనే సాగనుంది. హారిక-అరియాన ఇప్పటికే షో నుంచి నిష్క్రమించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.