ఫోటో స్టొరీ: యామీ అందం అదిరే!

Update: 2018-07-30 11:41 GMT
అందం ఉండటం వేరు దానికి తగ్గట్టు చందం ఉండటం వేరు.  చందం అంటే ఓ రకంగా బాడీ లాంగ్వేజ్ అనుకోవచ్చు.. యాటిట్యూడ్ అనుకోవచ్చు.  ఎందుకది ఇంపార్టెంట్ అంటే.. ఒక చిన్న అగ్లీ ఉదాహరణ చెప్పుకుందాం. ఓ మంచి బ్యూటీ ప్యారడైజ్ హోటల్ లో కనిపిస్తే అందరి కళ్ళు ఆమె పైకి అప్రయత్నంగా వెళ్తాయి.  అదే ఆ బ్యూటీ బిర్యానిలో ఉండే ముక్కల్ని బండగా తిని.. బ్రేవ్ అని త్రేల్చి.. పుల్ల పళ్ళలో పెట్టి కెలికిందనుకోండి.. నా సామి రంగా!

అందుకే ఒక్కఅందం అనలేదు మనోళ్ళు.. అందచందాలు అన్నారు.  ఈ అందచందాలు పుష్కలంగా ఉన్న భామ యామి గౌతమ్. చాలా హిందీ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాలు కూడా చేసి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయమైన ఈ హిమాచల్ ప్రదేశ్ సుందరి ఈమధ్య ఢిల్లీ లో జరుగుతున్న ఇండియా కూచర్ వీక్ 2018 లో పాల్గొంది.  ఆ ఈవెంట్ లో బ్రైడల్ ఫ్యాషన్ షో లో ర్యాంప్ వాక్ చేసింది.  అంటే పెళ్లికూతురి గెటప్ లో అలా వయ్యారంగా నడిచి  అందరి మనసుల్ని మెలిపెట్టి గట్టిగా లాగిందన్నమాట.

రేణు టాండన్ డిజైన్ చేసిన గోల్డెన్ క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, లెహెంగాలో తళుక్కున మెరిసింది యామి.  బ్రైడల్ వేర్ అనగానే ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ వేసుకొని, దగ్గరున్న  మేకప్పంతా తగిలించుకుని తయారవ్వలేదు.  సింపుల్ గా బ్యూటిఫుల్ గా రెడీ అయింది. మెడలో ఏ మాత్రం చెయిన్ గానీ నెక్లెస్ గానీ వేసుకోకపోయినా పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ తో బ్రైడల్  లుక్ ను కంప్లీట్ చేసింది.  ఇయర్ రింగ్స్ తన డ్రెస్సుకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఇక హెయిర్ ను రెగ్యులర్ స్టైల్లో కాకుండా రఫ్ గా ఉంచడం మరో విశేషం.   పెళ్లికూతురు రెడీ.. మరి బాలీవుడ్ బాయ్స్ ఎవరైనా రెడీనా?
Tags:    

Similar News