వైఎస్ ఆర్ సెమి బయోపిక్ 'యాత్ర' విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్ పథకాల వల్ల లాభపడిన కొందరు తమ అనుభవాలను వెళ్లడించేందుకు వచ్చారు. వైఎస్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర సహాయ దర్శకుడు రవికుమార్ మాట్లాడిన మాటలు అందరిని కదిలించాయి. గుండెలు పిండేసేలా అతడి మాటలు ఉన్నాయి. వైఎస్ వల్లే తన అమ్మ ఇంకా బతికి ఉందని, తన తల్లికి పునర్జీవం పోషిన వ్యక్తి వైఎస్ ఆర్ అంటూ రవికుమార్ చెప్పుకొచ్చాడు.
'యాత్ర' బయోపిక్ కు సహాయ దర్శకుడిగా చేసిన రవికుమార్ మాట్లాడుతూ... నేను డిగ్రీ చదువుతున్న సమయంలో అమ్మకు బాగాలేక హాస్పిటల్ కు తీసుకు వెళ్లాం. అప్పుడే అమ్మకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని వైధ్యులు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయాలని, అందుకు మూడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆరు నెలల కంటే ఎక్కువగా బతకదని చెప్పారు. అప్పుడే అమ్మ నాకు బతకాలని ఉందిరా అంటూ చేతులు జోడించి నన్ను అడిగింది. దాంతో నేను హైదరాబాద్ కు వచ్చి దొరికిన పని చేస్తూ వచ్చాను. నాలుగు నెలలకు నేను సంపాదించింది 20 వేలు. ఆ డబ్బులు కూడా చార్జీలు, మందులకే అయ్యాయి.
అమ్మ ఇక తాను బతకని నిర్ణయించుకుని నన్ను దగ్గరకు పిలిచి చెల్లిని బాగా చూసుకో అంటూ చెప్పింది. అప్పుడే ఆరోగ్య శ్రీ గురించి తెలిసి కామినేని హాస్పిటల్ లో జాయిన్ చేశాము. వైఎస్ ఆర్ గారి దయవల్ల మా అమ్మకు రూపాయి ఖర్చు లేకుండా కామినేనిలో వైధ్యం చేశారు. అమ్మ పూర్తిగా కోలుకుంది. అందుకే వైఎస్ మాకు దేవుడు అయ్యాడు. మా ఇంట్లో వైఎస్ పటాలు దేవుడి పటాల మాదిరిగా ఉంటాయని రవి కుమార్ చెప్పాడు. రవి కుమార్ మాట్లాడిన మాటలు వైఎస్ అభిమానులను మాత్రమే కాకుండా అందరి గుండెలను పిండేసింది. మా అమ్మకు నేను సినిమాల్లో చేస్తున్నట్లుగా చెప్పలేదు. ఈ సినిమాకు నేను సహాయ దర్శకుడిగా చేస్తున్నట్లుగా చెప్పి, నా తల్లికి, చెల్లికి ఈ సినిమాను చూపిస్తానంటూ రవికుమార్ సంతోషంగా చెప్పుకొచ్చాడు.