ఫస్ట్ డోస్ వాక్సిన్ వేయించుకున్న యంగ్ హీరోయిన్!

Update: 2021-06-02 18:30 GMT
సినిమా ఇండస్ట్రీలో అన్నీ క్రాఫ్టులు పనిచేస్తేనే ఓ సినిమా తయారవుతుందనే విషయం అందరికి తెలిసిందే. అందులో ఏ ఒక్క క్రాఫ్ట్ వర్క్ ఆగిపోయినా సినిమా మొత్తం ఆగిపోతుంది. ప్రస్తుతం దేశంలో బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు షూటింగ్స్ నిలిపేయడం జరిగింది. దానికి కారణం కరోనా ప్రభావం. ఈ మహమ్మారి కారణంగా గత పదిహేను నెలలుగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. షూటింగ్స్ నిలిపేసి ఎక్కడి సినిమాలను అక్కడే ఆపేసింది. ఇదివరకే దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ పాటించినప్పటికీ ఈ మహమ్మారిని నియంత్రించడం ఎవరి తరం కాలేదు. ఓ వైపు ప్రభుత్వాలు.. మరోవైపు వైద్య బృందాలు - శాస్త్రవేత్తలు నియంత్రించానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ దీనికి సరైన విరుగుడు మాత్రం ఇంకా రాలేదనే చెప్పాలి. కరోనా ప్రభావం రోజురోజుకి ఎంత వేగంగా విస్తరిస్తుందో.. వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్స్ జరుపుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా కరోనా బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సినిమాల షూటింగ్స్ ధైర్యం చేసి ప్రారంభం చేసినా ఆర్టిస్టులకు కరోనా సోకి భయంతో నిలిపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు వైద్యులు సూచించేది ఒక్కటే కరోనా వాక్సిన్.

ప్రస్తుతం ఈ వాక్సిన్ పై ప్రభుత్వాలతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగానే తాజాగా కరోనా వాక్సిన్ వేయించుకుని వార్తల్లో నిలిచింది యంగ్ హీరోయిన్ ఐశ్వర్యరాజేష్. ఈ భామ ఈరోజు తన మొదటి డోస్ వాక్సిన్ వేయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే అందరూ కూడా వాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చింది అమ్మడు. ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో టక్ జగదీష్ - పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లోని అయ్యప్పనుమ్ కోషియం సినిమాలు చేస్తోంది. ఇందులో టక్ జగదీష్ ఆల్రెడీ విడుదలకు సిద్ధం అయింది. అలాగే వీటితో పాటుగా మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన రిపబ్లిక్ సినిమాలో నటించింది.
Tags:    

Similar News