వైవీఎస్ చౌదరి ఎన్నెన్నో ఆశలతో రిలీజ్ చేసిన 'రేయ్' ఫలితమేంటో తొలి రోజుకే తేలిపోయింది. రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోయాయి. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా అనుకున్న తేదీ కంటే ఆరు రోజులు ఆలస్యంగా వచ్చినా.. 'రేయ్'కి కలిసొచ్చిందేమీ లేదు. చౌదరి పరిస్థితి తెలిసి అయ్యో పాపం అనుకుని సినిమా గురించి మరీ బ్యాడ్‌గా ఏమీ ప్రచారం చేయలేదు జనాలు. అయినప్పటికీ థియేటర్లు రెండో రోజు నుంచే వెలవెలబోయాయి. రెండో వారం వచ్చేసరికి చాలా చోట్ల సినిమాను తీసేశారు. కానీ చౌదరికి తన సినిమా మీద ఇంకా ఆశలు చచ్చిపోలేదు.
సమ్మర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అంటో థర్డ్ వీక్ పోస్టర్ కూడా రెడీ చేశాడు. ప్రముఖ పత్రికలన్నింట్లో భారీగా ప్రకటనలు కూడా ఇచ్చాడు. దీనికి ఇంకొన్ని లక్షలు నష్టం. నిన్న సన్నాఫ్ సత్యమూర్తి రిలీజ్‌తో 'రేయ్' ఉనికే లేకుండా పోయింది. అక్కడక్కడా కొన్ని థియేటర్లలో మాత్రమే సినిమాను నడిపిస్తున్నారు. ఈ థియేటర్లన్నింట్లో హౌస్‌ఫుల్స్ పడితే తప్ప చౌదరి యాడ్స్ కోసం పెట్టుకున్న ఖర్చు వచ్చే పరిస్థితి లేదు. సినిమా రిలీజ్‌కు ముందు పవనిజం పాట కోసం కూడా కొన్ని లక్షలు తగలెట్టాడు చౌదరి. కానీ ఆ పాట వల్ల సినిమాకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. మొత్తానికి ఈ పబ్లిసిటీ వ్యవహారాలకు పెట్టిన ఖర్చు మాత్రమే చౌదరికి తిరిగి వచ్చుంటే గొప్ప అన్నట్లుంది. సినిమా పోయిందని తెలిశాక కూడా చౌదరి ఇలా లక్షలకు లక్షలు తగలేయడం ఎందుకో చౌదరికే తెలియాలి.