కల్కి 2: అసలు కథ ఇదన్నమాట!

ఇక నిర్మాత అశ్విని దత్ ఇటీవల కల్కి 2 గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Update: 2025-01-16 09:30 GMT

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD తెలుగు సినిమా చరిత్రలో ఒక బిగ్ రికార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడి, విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించింది. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా గర్వకారణంగా నిలిచింది.

ఇప్పటికే కల్కి 2 సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నిర్మాత అశ్విని దత్ ఇటీవల కల్కి 2 గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సీక్వెల్ కథ మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పాత్రలు ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లకు సంబంధించినవి కావడం విశేషం.

మొదటి భాగంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండగా, కమల్ హాసన్ కలి పాత్ర పరిమిత స్క్రీన్ టైమ్‌తో మాత్రమే ఉండింది. ఇది అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. కానీ, కల్కి 2లో కమల్ హాసన్ పూర్తి స్క్రీన్ టైమ్‌లో కనిపించి, ప్రభాస్‌తో సన్నివేశాలు ప్రేక్షకులకు విశేషమైన అనుభూతిని కలిగిస్తాయని అశ్విని దత్ పేర్కొన్నారు.

కమల్ హాసన్ ఇప్పటికే ప్రమోషన్ల సమయంలో తన పాత్ర గురించి వివరించి, ఇది రెండవ భాగంలో మరింత డెవలప్ అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు కథను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంటాయని అంచనా. అమితాబ్ పాత్రకు ఈ సారి కూడా ప్రాధాన్యం ఉండడం విశేషం. దీపికా పదుకొణె పాత్ర కూడా రెండవ భాగంలో ప్రాముఖ్యాన్ని సాధిస్తుందని అశ్విని దత్ క్లారిటీ ఇచ్చారు.

నూతన పాత్రలు ఈ సారి రావడం అనుమానమేనని నిర్మాత తెలిపారు. ఇది మొత్తం నారేటివ్‌ను ముగించేందుకు కేవలం ప్రధాన పాత్రల చుట్టూనే కథ సాగుతుందని చెప్పారు. సెకండ్ పార్ట్ 2026లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు అశ్విని దత్ స్పష్టం చేశారు. కల్కి 2 కథ, నిర్మాణ విలువలు, సాంకేతికతతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఈసారి బాక్సాఫీస్ వద్ద పార్ట్ 2తో 2000 కోట్లు రావడం గ్యారెంటీ అనేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News