డైరెక్టర్స్ కెరీర్ లోనే వశిష్ట రికార్డు
'బింబిసార' టైమ్ ట్రావెల్ బేస్ తో నడిచిన కథ. కమర్శియల్ గా సినిమా బాగా ఆడింది. యూనిక్ గానూ కనెక్ట్ అయింది.
మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం అంట అంత ఈజీ కాదు. ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండాలి. వాటిలో విజయాలు ఎక్కువగా ఉండాలి. అవి బలమైన కథ..కథనాలతో తెరకెక్కి ఉండాలి. మేకింగ్ పరంగా ఎక్కడా చిన్న పాటి తప్పిదాలు కూడా కనిపించకూడదు. అలా అన్ని రకాలుగా పర్పెక్ట్ గా ఉంటేనే చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం ఇస్తారు. ఇలా పర్పెక్షన్ రావాలంటే కనీసం ఐదారు హిట్ సినిమాలకైనా పనిచేసి ఉండాలి.
కానీ యంగ్ మేకర్ మల్లిడి వశిష్ట విషయంలో మెగాస్టార్ అవేం పట్టించుకోలేదు. `బింబిసార` అనే తొలి సినిమా సక్సెస్ చూసి చిరు రెండవ సినిమాకే తనని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించారు. ఇది నిజంగా డైరెక్టర్స్ కెరీర్ లోనే ఓ రికార్డుగా భావించాలి. ఇప్పటివరకూ ఇలా రెండవ సినిమానే ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికీ రాలేదు. కేవలం వషిష్టకి మాత్రమే ఆ ఛాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులున్నారు.
వాళ్లంతా కూడా చాలా సినిమాలకు పనిచేసిన వారి. దర్శకత్వంలో ఎంతో సుదీర్ఘ అనుభవం సంపాదిం చిన తర్వాత మెగాస్టార్ వరకూ వెళ్లగలిగారు. రచనపట్ల కొంత అవగాహనే అనేది అవసరం అని చిరు భావిస్తారు. ఈ నేపథ్యంలో చిరుతో సినిమా అంటే కేవలం మేకింగ్ పైనే కాకుండా...రచనపైనా కొంత అనుభవం సంపాదించిన తర్వాత చిరు ని ఎలాగూ లాక్ చేసే వారు. కానీ వశిష్ట మాత్రం తొలి సినిమాతోనే మెగాస్టార్ ని మెప్పించాడు.
'బింబిసార' టైమ్ ట్రావెల్ బేస్ తో నడిచిన కథ. కమర్శియల్ గా సినిమా బాగా ఆడింది. యూనిక్ గానూ కనెక్ట్ అయింది. చిరంజీవి ఇవే అంశాలు వశిష్ల చూసి ధైర్యంగా ముందుకెళ్లిపోవచ్చని డిసైడ్ అయ్యారు. అందుకే 156వ సినిమా వశిష్ట ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు చిరంజీవి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత విశిష్ట పై ఉంది. చిరంజీవి నమ్మారు అంటే కోట్ల మంది అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని వశిష్ట పనిచేయాల్సి ఉంటుంది. చిరు నమ్మారంటే..అభిమానులు అంతకు మించి బలంగా నమ్ముతారు. వాళ్లందర్నీ మెప్పించేలా..మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా సినిమా తీయాలి.