సూర్య- వెంకీ అట్లూరి సినిమాలో హీరోయిన్ ఫిక్స్?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు స్ట్రయిట్ మూవీకి దాదాపు రంగం సిద్ధమైనట్టే సమాచారం అందుతుంది. ఎప్పుడో 15 ఏళ్ల కిందట రక్త చరిత్ర2 చేసిన సూర్య ఆ సినిమాతో ఆశించినంత హిట్ అందుకోలేక పోయాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు స్ట్రయిట్ మూవీకి దాదాపు రంగం సిద్ధమైనట్టే సమాచారం అందుతుంది. ఎప్పుడో 15 ఏళ్ల కిందట రక్త చరిత్ర2 చేసిన సూర్య ఆ సినిమాతో ఆశించినంత హిట్ అందుకోలేక పోయాడు. సూర్యకు తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉంది. దాన్ని వాడుకోవాలని ఎంతో మంది తెలుగు డైరెక్టర్లు ట్రై చేశారు కూడా.
కానీ తమిళంలో ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల సూర్య తెలుగు సినిమా చేయలేకపోయాడు. మొత్తానికి ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ సూర్యను ఓ తెలుగు సినిమాకు కమిట్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇప్పటికే వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే వెంకీ దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఓ కొత్త మోడల్ కారు ని డిజైన్ చేసే క్రమంలో హీరోకు ఎదురయ్యే సంఘటనల నేపథ్యంలో మంచి యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందనుందని టాక్ వినిపిస్తుంది. సినిమాలో ఎన్నో ట్విస్టులు, డ్రామాతో పాటూ ఎమోషన్స్ కూడా ఉండేలా వెంకీ ఈ స్టోరీని రాసుకున్నాడంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించనుందని సమాచారం. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఆర్జె బాలాజీతో 45వ సినిమా చేస్తున్న సూర్య, ఆల్రెడీ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రెట్రో అనే సినిమాను పూర్తి చేశాడు. సమ్మర్ లో రెట్రో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వెట్రిమారన్ తో కూడా సూర్య ఓ మూవీ కమిట్ అయ్యాడు కానీ ఆయన సినిమా ఇంకాస్త లేటయ్యేలా ఉండటంతో ఈలోగా వెంకీ సినిమాను పూర్తి చేసుకుని వస్తానని సూర్య మాటిచ్చాడని టాక్ వినిపిస్తుంది.