కరెక్ట్ రూట్ లో కార్తికేయ..!

లాస్ట్ ఇయర్ బెదురు లంక అంటూ వచ్చి ఆడియన్స్ నుంచి సర్ ప్రైజ్ హిట్ అందుకున్నాడు కార్తికేయ.

Update: 2024-06-04 05:50 GMT

స్టార్ హీరోలేమో పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతుంటే తెలుగు ఆడియన్స్ కి సరికొత్త కథలను చెప్పేందుకు తమ కెరీర్ స్ట్రాంగ్ అయ్యేలా ప్రయోగాలు చేసేందుకు ముందుకొస్తున్నారు యువ హీరోలు. ముఖ్యంగా ప్రేక్షకులను మెప్పించడం కోసం వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. యువ హీరోల్లో తన మార్క్ చాటేందుకు ఆసక్తిగా ఉన్న హీరో కార్తికేయ లేటెస్ట్ గా తన సినిమా భజే వాయు వేగంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. RX 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ తర్వాత అరడజనుకి పైగా సినిమాలు చేశాడు కానీ అవేవి వర్క్ అవుట్ కాలేదు.

లాస్ట్ ఇయర్ బెదురు లంక అంటూ వచ్చి ఆడియన్స్ నుంచి సర్ ప్రైజ్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో భజే వాయు వేగం సినిమా చేశాడు. ఏదో హీరో అయ్యాం కదా ఏ సినిమా పడితే ఆ సినిమా చేద్దాం అన్నట్టు కాకుండా కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ మంచి కథలను చేయాలనే ఆలోచనతో ఉన్నాడు కార్తికేయ. చేసిన సినిమాల వల్ల తనను తాను మెరుగుపరచుకుని కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు కార్తికేయ.

భజే వాయు వేగం సినిమా ఓకే చేసే టైం లో దాదాపు 60 కథల దాకా విన్నా ఏది అంత కిక్ ఇవ్వలేదట. ఐతే భజే వాయు వేగం విన్న తర్వాత ఇదేదో వర్క్ అవుట్ అయ్యేలా ఉందని డైరెక్టర్ కి ఓకే చెప్పాడట. అంతకుముందు ఏమో కానీ భజే వాయు వేగం సినిమా తర్వాత కార్తికేయ సినిమా సెలక్షన్ మీద ఒక క్లారిటీ వచ్చింది. యువ హీరో కరెక్ట్ రూట్ లో వెళ్తున్నాడని అనిపిస్తుంది. బెదురులంక ముందు వరుస ఫ్లాపులు ఫేస్ చేసిన కార్తికేయ వలిమై, గ్యాంగ్ లీడర్ సినిమాల్లో నెగిటివ్ రోల్స్ కూడా చేశాడు.

బెదురులంక హిట్ పడిన తర్వాత మళ్లీ జోష్ అందుకున్న కార్తికేయ భజే వాయు వేగం కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఇది కదా అసలైన కిక్ అని అనుకుంటున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా హీరోల ఎఫర్ట్ చూసి కూడా అతనికి సక్సెస్ రావాలని ఆడియన్స్ కోరుకుంటారు. అలాంటి వారిలో కార్తికేయ ఒకరని చెప్పొచ్చు. భజే వాయువేగం తర్వాత కార్తికేయ చేసే సినిమాలో కచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఉంటుందని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సినిమా వెంట సినిమా చేయడం కాదు కంటెంట్ ఉన్న సినిమా చేస్తేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారన్న లాజిక్ పట్టేసిన కార్తికేయ ఇక మీదట కెరీర్ లో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పొచ్చు.

Tags:    

Similar News