రీ-రీ-రిలీజ్ లో ఆయన సక్సెస్ అయినట్లే!
2010 అనంతరం మళ్లీ గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. రీ-రిలీజ్ లో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది.
మొత్తానికి అనుకున్నదే జరిగింది. `ఆరేంజ్` రీ-రీ-రిలీజ్ లో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. సినిమాకి దక్కుతోన్న ఆదరణ చూస్తుంటే నిజంగానే 2010లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా పెద్ద మైనస్ గా కనిపిస్తుంది పదేళ్ల తర్వాత రిలీజ్ అవ్వాల్సిన సినిమా పదేళ్ల ముందు రిలీజ్ అయితే అలాంటి ఫలితమే ఉంటుందని రీ-రిలీజ్ రిజల్ట్ చూసిన తర్వాత క్లియర్ గా అర్దమవుతుంది.
2010 అనంతరం మళ్లీ గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. రీ-రిలీజ్ లో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో మరోసారి ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మళ్లీ రీ-రీ-రిలీజ్ చేసారు. ఇప్పుడు మంచి విజయం అందుకుంది. తొలి రోజే సినిమా కోటికి పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ చెబుతుంది. రెండవ సారి రీ-రిసిలీజ్ అయినా ఇంతటి ఆదరణ దక్కడం చాలా అరుదైన విషయమని సినీ పరిశీలకులు భావిస్తున్నారు.
సినిమాకి మెరైగన అడ్వాన్సు బుకింగ్ లో ఏంటో బాగున్నాయి. థియేటర్లలో ‘ఆరెంజ్’ స్పెషల్ షోల సమయంలో జరిగిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాటలు స్క్రీన్ మీద రాగా, థియేటర్ మొత్తం మ్యూజిక్ ఫెస్టివల్‌లా మారిపోయింది. ప్రేక్షకాభిమానులు సీటు నుంచి పైకి లేచ్చి డాన్సులు చేస్తున్నారంటే ఎంతగా కనెక్ట్ అయిందన్నది అద్దం పడుతుంది. థియేటర్ రెస్పాన్స్ చూసి భాస్కర్ ఇప్పుడెంతో సంతోషంగానూ కనిపిస్తున్నాడు.
ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా కోసం రెండు విభిన్నమైన క్లైమాక్స్‌లు రాసుకున్నాను. ప్రారంభంలోనే ప్రధాన జంట విడిపోతుందని ఊహించాను. ఇది కథను మరింత ప్రభావితం చేస్తుందని నమ్మాను. కానీ అప్పుడు నేను అనుకున్న విధంగా జరగలేదు. కొన్ని చర్చలు...నిర్మాతల సలహాలతోనే సినిమా అంతటా ప్రధాన పాత్రలు ఎదుర్కొన్న పోరాటాలను పరిగణనలోకి తీసుకుని సుఖాంతం చేసాను. కథలో ఈ మార్పు ఉన్నప్పటికీ అసలు క్లైమాక్స్ మరింత బలంగా చెప్పాలనుకున్నాను` అన్నారు.