ఫోటో స్టోరి: జాన్వీ మెడ‌లో ఆభ‌ర‌ణాలు జిగేల్

ఈ పాట‌లో జాన్వీ అందం చందం న‌ట‌న‌కు మంత్ర‌ముగ్ధుడైన ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియా సైతం వ్వావ్ అంటూ ఉత్సాహం ప్ర‌ద‌ర్శించాడు.

Update: 2024-08-06 15:30 GMT

చుట్ట‌మేలే.. అంటూ చ‌లి జ్వ‌రం పుట్టించింది జాన్వీ క‌పూర్. తెలుగు లోగిళ్ల‌లోకి చుట్టంలా అడుగుపెడుతున్న శ్రీ‌దేవి గారాల త‌న‌య‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- కొర‌టాల బృందం ఘ‌న‌మైన స్వాగ‌త‌మే ప‌లుకుతున్నారు. దేవ‌ర షూటింగ్ పూర్త‌యింది. సెప్టెంబ‌ర్ చివ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇంత‌లోనే ఈ సినిమా నుంచి విడుద‌లైన రెండు సింగిల్స్ యూత్ హార్ట్ ని ట‌చ్ చేసాయి. ముఖ్యంగా జాన్వీ క‌పూర్- తార‌క్ జంట‌పై చుట్ట‌మేలే రొమాంటిక్ మెలోడీ యువ‌హృద‌యాల్లో గిలిగింత‌లు పెట్టింది. మామ్ శ్రీ‌దేవికి సిస‌లైన న‌టవార‌సులు జాన్వీ అంటూ కితాబిచ్చే లెవ‌ల్లో ఎంతో అందంగా క‌నిపించిన జాన్వీ త‌న డ్యాన్సింగ్ స్టైల్ తోను మ‌తులు చెడ‌గొట్టింది.


ఈ పాట‌లో జాన్వీ అందం చందం న‌ట‌న‌కు మంత్ర‌ముగ్ధుడైన ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియా సైతం వ్వావ్ అంటూ ఉత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. జాన్వీ-ఎన్టీఆర్ డ్యాన్సింగ్ క్లిప్స్ ఇప్పుడు వెబ్ ని హీటెక్కిస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో ఇంత‌గా వైర‌ల్ అయిన మ‌రో క్లిప్ లేదు. జాన్వీ ఈ పాట‌లో ప‌ద్ధ‌తిగా చీర ర‌వికెలో అందంగా క‌నిపించింది. కొంచెం ఘాటుగానే అందాల‌ను ఆర‌బోసింది.

అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు రిచ్ యాంబియెన్స్.. అల్ట్రా రిచ్ ప్రిన్సెస్ త‌ర‌హా లుక్ తో ప్ర‌త్య‌క్ష‌మైంది. ప్ర‌ఖ్యాత పీకాక్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం జాన్వీ ఈ ఫోటోషూట్ లో పాల్గొంది. తాజాగా రివీలైన ఫోటోలో పింక్ లెహంగాలో జాన్వీ ముగ్ధ మ‌నోహ‌ర రూపం హృద‌యాల‌ను దోచుకుంది. ఇక క్రిస్ట‌ల్స్ డైమండ్స్ తో రూపొందించిన డిజైన‌ర్ టాప్‌లో జాన్వీ అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో దుమ్ము రేపుతోంది.

పీకాక్ ఇంట‌ర్వ్యూలో జాన్వీ త‌న షూటింగ్ ల‌ అనుభ‌వం గురించి వెల్లడించింది. ``ఒక పాత్రలో లోతుగా లీనమవ్వడం మానసికంగా బాధ కలిగించవచ్చని నేను అంగీకరిస్తున్నాను. షూట్ తర్వాత స్విచ్ ఆఫ్ చేసి, రియాలిటీకి తిరిగి రావడానికి ఒక పద్ధతిని కలిగి ఉండటం ముఖ్యం. నా పాత్ర, నా వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. నా కుటుంబం, స్నేహితులు, అభిరుచులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను ఆ రీసెట్ బటన్‌ను పోస్ట్-ప్యాక్-అప్‌ని నొక్కడానికి ప్రయత్నిస్తాను. ఇది మానసికంగా బ్రేక్ అవ్వ‌డానికి .. తిరిగి రీఛార్జ్ చేయడానికి నాకు సహాయపడుతుంది``అని వెల్ల‌డించింది. జూలై-ఆగస్టు-సెప్టెంబర్ 2024 త్రైమాసిక‌ సంచికకు మా కవర్‌స్టార్ జాన్వీ కపూర్ అని పీకాక్ వెల్ల‌డించింది.

జాన్వీ సినీరంగంలో ఆరు సంవత్సరాల పాటు సాగించిన ప్రయాణం,.. త‌న‌ ఎక్సలెన్స్ గురించి.. మంచి సినిమాని అందించడం కోసం ఎడతెగని అన్వేషణ గురించి ఈ క‌వ‌ర్ స్టోరి వెల్ల‌డిస్తుంది. నాయికా ప్ర‌ధాన‌ చిత్రాల ఛాంపియన్‌గా కెరీర్ ప్రారంభంలో కొన్ని శక్తివంతమైన పాత్రలను పోషించింది. జాన్వీ గొప్ప న‌టి..తన ప్రయాణాన్ని ఇంకా ప‌రిణ‌తితో కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. ప్రతి కొత్త సవాలును ఉత్సాహంగా, కృతజ్ఞతతో స్వీకరించింది. ది పీకాక్ మ్యాగజైన్ ఇంట‌ర్వ్యూలో జాన్వీ భ‌విష్య‌త్ క‌ల‌ల గురించి ప్ర‌స్థావించారు. జాన్వీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. ఓవైపు ఎన్టీఆర్ తో దేవ‌ర చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తూనే రామ్ చ‌ర‌ణ్- బుచ్చిబాబు సినిమాని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News