నా జాన్ స్పూర్తితో 14 కిలోలు త‌గ్గాను!

బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ లుక్ ఇప్పుడు మారిన సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులుగా స్లిమ్ లో క‌నిపిస్తున్నారు

Update: 2024-08-20 04:59 GMT

బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ లుక్ ఇప్పుడు మారిన సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజులుగా స్లిమ్ లో క‌నిపిస్తున్నారు. నెత్తిమీద హెయిర్ కూడా క‌నిపిస్తుంది. అత‌డి న్యూ లుక్ చూస్తే ఇత‌డు బోనీక‌పూరేనా? అన్న సందేహం రావ‌డం స‌హ‌జం . అంత‌గా బోనీ క‌పూర్ లో మార్పులొచ్చాయి. మ‌రి ఇది ఎలా సాధ్య‌మైంది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.. అదేంటే ఆయ‌న మాటల్లోనే

`నా జాన్ శ్రీదేవి స్పూర్తితోనే ఫిట్ నెస్ పై దృష్టిపెట్టాను. క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టాను. ఇప్ప‌టికే 14 కిలోలు త‌గ్గాను. ఇంకా 8 కిలోలు త‌గ్గాలి. ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. అధిక బ‌రువుతో ఎన్ని స‌మ‌స్య‌లుంటాయో? బ‌రువు త‌గ్గిన త‌ర్వాత తెలుస్తుంది. నా జుట్టు కూడా ఒత్తుగా ఉంది. ఇప్పుడు మ‌రింత బెట‌ర్ లుక్ లోకి మారాను. నాజాన్ ఆలోచ‌న‌లు ఎప్పుడూ నా వెంటే ఉంటాయి. త‌ను నిత్యం నాతోనే ఉంటుంది.

ఆమె గొప్ప ఫిట్ నెస్ ప్రీక్. ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేది. ఇప్పుడు ఆమె స్పూర్తితో నేను మొద‌లు పెట్టాను` అని అన్నారు. బోనీకపూర్ న్యూ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డం చూసి నెటి జ‌నులు షాక్ అవుతున్నారు. ఇత‌నేంటి ఇలా మారిపోయాడు? మ‌న బోనీ క‌పూరేనా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. స్లిమ్ లుక్ లోబ్లూ టీషర్ట్ ధ‌రించి..క‌ళ్ల‌కు న‌ల్ల‌టి అద్దాలు పెట్టుకున్న ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఆపిక్ వైర‌ల్ గా మారింది.

ఇక బోనీక‌పూర్ నిర్మాత‌గా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అంత‌కంటే ముందు కుమార్తెల కెరీర్ ని సెట్ చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే జాన్వీ సెట్ అయింది. చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్ ని కూడా లాంచ్ అవుతుంది. ఇద్ద‌రు తండ్రి సూచ‌న‌లు, స‌ల‌హాల‌తోనే ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News