మంచి సినిమాను మనం మిస్ అవ్వబోతున్నామా?
అయితే తెలుగు సినిమాల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో సంక్రాంతి కి ఈ సినిమాకు థియేటర్లు దక్కడం కష్టంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి ఓ రేంజ్ లో ఉండబోతుంది. అయిదు సినిమాలు రావాల్సి ఉండగా రవితేజ ఈగల్ సినిమా ను వాయిదా వేయించారు. మిగిలిన నాలుగు సినిమాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
సంక్రాంతికి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు కూడా విడుదల అవ్వబోతున్నాయి. ముఖ్యంగా పొంగల్ రేసులో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ విడుదల అవ్వబోతుంది. ఈ మధ్య ధనుష్ సినిమాలకు తెలుగు లో మంచి బిజినెస్ జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ధనుష్ సినిమాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్ సినిమా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందని, తప్పకుండా తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకునే కంటెంట్ సినిమాలో ఉందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. తాజాగా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.
స్వాతంత్య్రం రాకముందు సాగే కథ తో ఈ సినిమా రూపొందింది. కెప్టెన్ గా పని చేసే భారతీయుడు ఇంగ్లీష్ దొరల మీద ఎలా విరుచుకు పడ్డాడు, స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలా పాల్గొన్నాడు అనేది సినిమా కథగా ట్రైలర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.
ఆసక్తికర కథ మరియు కథనంతో సాగే ఈ సినిమా తప్పకుండా ఒక మంచి కమర్షియల్ సినిమా గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ ట్రైలర్ చూసిన తర్వాత అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే తెలుగు సినిమాల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో సంక్రాంతి కి ఈ సినిమాకు థియేటర్లు దక్కడం కష్టంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తీవ్రమైన పోటీ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేక పోతున్న కెప్టెన్ మిల్లర్ సినిమా థియేట్రికల్ స్క్రీనింగ్ ను తెలుగు ప్రేక్షకులు మిస్ అవ్వబోతున్నారు అంటూ ధనుష్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత వరకు సాధ్యం అయితే అంత వరకు సినిమా ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ రిలీజ్ తర్వాత వారం తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్దకు కెప్టెన్ మిల్లర్ వస్తాడనే చర్చ కూడా జరుగుతోంది.