చందూ మొండేటి.. మళ్ళీ వారితోనే..

ప్రస్తుతం యంగ్ హీరో నాగచైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-10-16 11:06 GMT

చందూ మొండేటి.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. వరుస హిట్స్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. రీసెంట్ గా తెలుగు సినిమా గర్వించే క్షణాలను చిత్ర పరిశ్రమకు అందించారు. ఆయన తెరకెక్కించిన కార్తికేయ 2 ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం యంగ్ హీరో నాగచైతన్య తండేల్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తండేల్ మూవీపై ఇప్పటికే ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చందు తెరకెక్కిస్తున్నారు. చాలా నేచురల్ గా మూవీని తీస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే తండేల్ తర్వాత.. చందు నెక్స్ట్ ఏంటన్నది ఇంకా క్లారిటీ లేదు. ఏ హీరోతో వర్క్ చేస్తారన్న విషయంపై ఇప్పటి వరకు ఆయన ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితం మాత్రం.. తండేల్ నిర్మిస్తోన్న గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే మరో మూవీ చేయనున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ ఆ మూవీని నిర్మించనుందని సమాచారం. ఇప్పటికే చందు.. కథను సిద్ధం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

పీరియాడిక‌ల్ డ్రామాగా చందు తెరకెక్కించనున్నారని.. లీడ్ రోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. బీ టౌన్ కు చెందిన ఓ బడా ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో భాగమవ్వనుందని వినికిడి. తండేల్ అయ్యాక.. వెంటనే ఆ ప్రాజెక్టుతో చందూ మొండేటి బిజీ అవ్వనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని విషయాలు అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

అయితే గీతా ఆర్ట్స్ కొంతకాలంగా భారీ చిత్రాల‌పై దృష్టి సారించ‌డం లేదనే చెప్పాలి. చిన్న‌, మీడియం సినిమాల‌పై స్పెషల్ ఫోక‌స్ పెట్టింది. జీఏ 2 సంస్థ వాటి బాధ్యతలను చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తండేల్ మూవీతో మళ్లీ భారీ చిత్రాల బాట పట్టింది. చైతూ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తండేల్ ను నిర్మిస్తోంది. ఇక చందూ మొండేటి, బాలీవుడ్ హీరో కాంబో ప్రాజెక్టును కూడా భారీ బడ్జెట్ తో రూపొందించనుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీని కూడా ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధం చేస్తోంది. మరి గీతా ఆర్ట్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News