నాగ చైతన్యతో తెనాలి రామకృష్ణ చేస్తా..!
సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తండేల్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. అక్కినేని ఫ్యాన్స్ అయితే తండేల్ సక్సెస్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తండేల్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా అక్కినేని నాగార్జున వచ్చారు. తండేల్ సినిమా సక్సెస్ గురించి ఆయన మాటల్లో చెప్పారు. ఈ సక్సెస్ తో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారని అన్నారు నాగార్జున. ఇక ఈవెంట్ లో డైరెక్టర్ చందు మొండేటి స్పీచ్ కూడా అలరించింది. అంతేకాదు మరో సినిమా ప్రకటన కూడా చేసి సర్ ప్రైజ్ చేశారు.
చందు మొండేటి మాట్లాడుతూ.. చైతన్య గారికి సక్సెస్ రావడం నాగార్జున గారికి ఎంత సంతోషంగా ఉందో నాకు తెలుసని అన్నారు. ఐతే ఆయన కంటే రెట్టింపు సంతోషంతో నేను అభిమానులం ఉన్నామని అన్నారు చందు మొండేటి. ఇది మొదలు ఇక అన్నీ సిక్సర్లే అని చెప్పుకొచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ రూపంలోనే కథ తెరపైకి వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.. వాసు గారితో నా జర్నీ కూడా అలానే కొనసాగుతుందని అన్నారు చందు.
అరవింద్ గారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని.. ఆయన స్థిత్రప్రగ్జుడు. ఇక ఫ్యూచర్ లో గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నామని.. నాగేశ్వర రావు గారు చేసిన తెనాలి రామకృష్ణ కథ మళ్లీ అద్భుతంగా రాసి ఈ తరానికి తగినట్టుగా తీసుకొస్తామని అన్నారు చందు మొండేటి. ఐతే ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ రెట్టింపు అయ్యింది. డైరెక్టర్ హీరో కాంబినేషన్ హిట్ అయితే ఇక వారి సినిమాలకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. తండేల్ హిట్ తో చందు మళ్లీ మళ్లీ నాగ చైతన్యతో సినిమాలు చేసి ఫ్యాన్స్ కి సూపర్ హిట్ సినిమాలు అందిచే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.